indian bison
-
వైరల్: నిన్ను కూడా క్వారంటైన్‌కు పంపిస్తారు
సాక్షి, బెంగళూరు : కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఇంట్లోనే ఉంటూ కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. ప్రజలంతా ఇళ్లకే పరిమితం అవ్వడంతో రోడ్లన్నీ బోసిపోతున్నాయి. నిత్యం జనాలతో కిక్కిరిసిపోయే రహదారులన్నీ ఎవరూ లేక వెలవెలపోతున్నాయి. ఈ నేపథ్యంలో జన సంచారంలోకి రావడానికి బయపడే జంతువులు సైతం ధైర్యంగా రోడ్లపైకి వచ్చి స్వైర విహారం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ దున్నపోతు వార్తల్లో నిలిచింది. రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయనుకుందో లేక అడవిలో తిరిగి బోర్ కొట్టిందేమో.. ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చింది. ఖాళీగా ఉన్న రోడ్లు చూసి ఆశ్చర్యపోయి.. రోడ్డుపై సుకుమారంగా నడుచుకుంటూ అలా వెళ్లిపోయింది. (కరోనా : చైనాను అధిగమించిన అమెరికా) దేశంలోనే అడవి దున్నపోతులు ఎక్కువగా ఉండే మలబార్ సివెట్లోని దున్నపోతు కర్ణాటకలోని చిక్ మంగళూరు జిల్లా మార్కెట్ ప్రాంతలో షికార్లు చేసింది. దీంతో రోడ్లపై ఉన్న కొంత మంది ప్రజలు కూడా పక్కకు తప్పుకొని దానికి దారిచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను భారత అటవీశాఖ అధికారి సుశాంత నంద సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. ‘ఇండియన్ బిసోన్ (అడవి దున్నపోతు) వాకింగ్‌కు రోడ్లపైకి వచ్చింది. అతిపెద్ద బోవిన్.. దక్షిణ, ఆగ్నేయాసియాకు చెందినది. చాలా దూకుడుగా వ్యవహరిస్తుంది. బయట అరుదుగా కనిపిస్తుంది’ అనే క్యాప్షన్‌తో ట్విటర్లో షేర్ చేశారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో దీన్ని చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. జాగ్రత్త! పోలీసులు చూస్తే నిన్ను కూడా క్వారంటైన్‌కు తరలిస్తారు. అంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. -
తెలంగాణ రాష్ట్ర జంతువుగా అడవిదున్న!
అటవీశాఖ ఆమోదం..సీఎంవోకు చేరిన ఫైలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర జంతువుగా అడవిదున్న ఖరారైంది. దీనికి సంబంధించిన ఫైలుపై అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగురామన్న గురువారం సంతకం చేసి, ముఖ్యమంత్రి ఆమోదానికి పంపించారు. ఇండియన్ బైసన్‌గా వ్యవహరిస్తున్న అడవిదున్న రాష్ట్ర జంతువుగా ఖరారు చేశారు. రాష్ట్ర పక్షిగా పాలపిట్ట (ఇండియన్ రోలర్)ను నిర్ణయించారు. రాష్ట్ర చెట్టుగా ఇప్పచెట్టును ప్రకటించనున్నారు. రాష్ట్ర పుష్పంగా మోదుగుపువ్వును ఖరారు చేశారు. వీటిని రాష్ట్ర అటవీశాఖ ఆమోదించి, సీఎం కేసీఆర్‌కు ఫైలును పంపించారు. అది సీఎం కార్యాలయానికి చేరింది. సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన వెంటనే వీటిని అధికారికంగా ప్రకటించనున్నారు.