మనసు చిత్రం పదిలం | It is safe to mind the image | Sakshi
Sakshi News home page

మనసు చిత్రం పదిలం

Published Tue, Oct 28 2014 1:03 AM | Last Updated on Sat, Sep 2 2017 3:28 PM

మనసు చిత్రం పదిలం

మనసు చిత్రం పదిలం

 మనసులోని భావాలను కాన్వాస్‌పై కుంచెతో పలికిస్తాడు  చిత్రకారుడు. ఆ కళకు ఇప్పుడు సాంకేతికత తోడైంది. కుంచెకు ఫొటోషాప్ హంగులు మిళితమై... ‘చిత్రం’ బహుచిత్రమై... డిజిటల్ దారులు పడుతోంది. ఈ పరంపరలో అసలు రూపంలోని సహజ సౌందర్యం అ‘దృశ్య’మైపోతుందన్నది కొందరి వాదన. ఇదే ప్రశ్న మాసబ్‌ట్యాంక్ ‘జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్‌ఆర్ట్స్ యూనివర్సిటీ’ విద్యార్థులను అడిగితే... ఆసక్తికరమైన పెద్ద చర్చకే  తెర తీశారు.
 
 భరత్
: డిజిటల్‌ఎరా వచ్చాక బుర్రకు పని తగ్గిన విషయం నిజమే. కానీ సృజనాత్మకతకు ఉండే విలువ టెక్నాలజీని ఉపయోగించి చేసిన బొమ్మల్లో ఎంత వెదికినా కనిపించదు.

కాత్యాయిని: మాలాంటి ఆర్ట్ స్టూడెంట్స్‌పై కూడా టెక్నాలజీ ప్రభావం బాగానే ఉంది కానీ, కుంచె ప్రత్యేకత కుంచెదే కదా! ఫొటోషాప్‌తో చేసిన బొమ్మలు చూడ్డానికి చాలా బాగుంటాయి. కానీ భావం ఉండదు కదా! అది కావాలంటే మళ్లీ కళాకారుడి దగ్గరకే రావాలి.
 
చంద్ర: యస్... కంప్యూటర్ బొమ్మలను ఎన్నంటే అన్ని కాపీపేస్ట్ చేసుకోవచ్చు. కానీ చేత్తో గీసిన వాటిని అలా సృష్టించుకోలేం కదా. ఆ అవకాశం ఉంటే ప్రతి ఒక్కరి ఇంట్లో మొనాలిసా చిత్రం ఉండేదేమో.  

భరత్: పూర్వం తీసిన ఫొటో సరిగ్గా వచ్చిందా లేదో తెలుసుకోవాలంటే రీల్ కడిగితే కానీ తెలిసేది కాదు. ఇప్పుడలా కాదు.. క్లిక్ కొట్టినంత తేలిగ్గా డిలీట్ కూడా కొట్టేసుకుంటున్నాం.

సందీప్ చంద్ర: ఎన్ని కొత్త యాప్‌లొచ్చినా ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్‌కి ఉండే క్రేజ్ పదిలం.  
 
ప్రియాంక: పూర్వం వీధికో ఫొటో స్టూడియో ఉండేదట. ఇప్పుడు ఎక్కడో వెదికితే తప్ప కనిపించడం లేదు.  
 
కార్తీక్: ఉన్నవారు కూడా టెక్నాలజీని బాగా ఉపయోగించుకుని బిజినెస్ బాగా చేసుకుంటున్నారు.   
 
హరిణి
: ఫొటోగ్రఫీకి వాడుకున్నంతగా పెయింటింగ్‌లకు ఆర్ట్‌ని వాడుకోలేం. పై పై రంగులు అద్దినా... ఒరిజినల్‌కే క్రేజ్ ఎక్కువ.
 
సందీప్ చంద్ర
: టెక్నాలజీ సంగతి పక్కన పెడితే అసలు ఫైనార్ట్స్‌కి ఎంత క్రేజ్ ఉందో మాట్లాడుకుందాం.
 
హరిణి: ఎంత అనేకంటే... అసలు ఉందా అని ప్రశ్నించుకుంటే మేలేమో! నా విషయం చూసుకుంటే ఇంటర్ అయ్యాక.. ఫైనార్ట్స్‌లో చేరాతానంటే ఇంట్లో అందరూ తిట్టారు. అది నేర్చుకుంటే ఏం వస్తుందన్నారు.  
 
కాత్యాయిని
: దాన్ని ఇష్టం లేకపోవడం అనేకంటే అవగాహన లోపం అనొచ్చు.  
 
భరత్: ఎగ్జాక్ట్‌లీ... మన దగ్గర ఆర్ట్‌ని ప్రేమించేవారు, అర్థం చేసుకునేవారు, ప్రోత్సహించేవారు బాగా తక్కువ.  
 
కాత్యాయిని: అదే విదేశాల్లో అయితే... ఆర్ట్‌దే మొదటి స్థానం. కేజీ చదువుల నుంచే దీనిపై శ్రద్ధ పెడతారు.  
 
సందీప్ చంద్ర
: పెయింటింగ్ నేర్చుకుంటానంటే.. బొమ్మలు గీసుకుంటూ ఎలా బతుకుతావురా అంటారు. ఫొటోగ్రఫీ అంటే స్టూడియో పెట్టుకుంటావా అంటూ ఎగతాళి చేస్తారు. ఆర్ట్‌ని గుర్తించి, గౌరవించేవారు చాలా తక్కువ.
 
భరత్: పెయింటింగ్, ఫొటోగ్రఫీల్లో ప్రొఫెషనల్స్ అయి బాగా సంపాదించేవాళ్లు మన దగ్గర కూడా చాలామంది ఉన్నారు కానీ తగిన పబ్లిసిటీయే లేదు.

కాత్యాయిని: ఎన్ని చెప్పినా... నార్త్ ఇండియాతో పోలిస్తే సౌత్‌లో ఆర్ట్‌కున్న ప్రాధాన్యం తక్కువనిపిస్తుంది.
 
భరత్: పెయింటింగ్స్ చాలా ఖరీదనే కామెంట్ ఉంది.  

చంద్ర: అలాగని పెయింటింగ్ డబ్బున్నవారిదే అనుకోవద్దు. సామాన్యులకు అందుబాటులోకి తెచ్చే గ్యాలరీ షోలు కూడా ఇక్కడ ఉన్నాయి.  

 
సందీప్ చంద్ర: ఆర్టిస్ట్‌లు చేసే చారిటీ కూడా గుర్తుచేసుకోవాలి. బెంగుళూరులో కళాకారుడైన చింత భట్టాచార్య తన పెయింటింగ్‌లను ఒక స్వచ్ఛంద సంస్థకు ఉచితంగా ఇచ్చేశారు.

కాత్యాయిని: ఆర్ట్‌కి ఆదరణ పెంచడానికి ఇలాంటి ప్రయత్నాలు చాలా సహకరిస్తాయి.

భరత్: చివరగా.. ఎన్ని రకాల టెక్నాలజీలు వచ్చినా.. సహజసిద్ధమైన ఆర్ట్‌కు ఉండే ప్రాధాన్యం ఎప్పటికీ తరగదు. ఫొటోగ్రఫీలోనైనా, పెయింటింగ్‌లోనైనా నిలదొక్కుకుని తమని తాము నిరూపించుకోవాలంటే మాత్రం జీవితం మొత్తం ఆ కళకు అంకితమివ్వాలి. ఆపై రావల్సిన పేరు దానంతట అదే వస్తుందని నిరూపించిన ఆర్టిస్టులు మన ముందే చాలా మంది ఉన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement