కలర్స్ ఆఫ్ ఇన్‌క్లూజన్ ఫొటోగ్రఫీ కాంటెస్ట్
ఎయిడ్ ఎట్ యాక్షన్ సంస్థ ‘కలర్స్ ఆఫ్ ఇన్‌క్లూజన్’ పేరిట ఫొటోగ్రఫీ కాంటెస్ట్ నిర్వహిస్తోంది. ‘వివక్ష-దురాచారాలు’, ‘మానవ హక్కులు-సమానత్వం’, ‘బాలకార్మికులు-విద్య’ అనే అంశాలపై నిర్వహిస్తున్న ఈ పోటీలో ప్రొఫెషనల్, ఔత్సాహిక ఫొటోగ్రాఫర్లు ఎవరైనా పాల్గొనవచ్చు. ఈ పోటీ కోసం ఫొటోలను నవంబర్ 15వ తేదీలోగా photocontest@aideetaction.org ఐడీకి మెయిల్ చేయాలి. ఎంపికైన ఫొటోల వివరాలను నవంబర్ 20న, గ్రాండ్‌ప్రైజ్‌కు ఎంపికైన విజేత పేరును నవంబర్ 23న వెల్లడిస్తారు.
గ్రాండ్‌ప్రైజ్ విజేతకు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఫ్రాన్స్ పర్యటనకు పంపుతారు. పోటీలో ఎంపికైన ఉత్తమ ఫొటోలను ఢిల్లీ, చెన్నై, జైపూర్, ప్యారిస్‌లలో జరిగే ప్రదర్శనలలో ప్రదర్శిస్తారు. మరిన్ని వివరాల కోసం +9109445510402 నంబర్‌కు సంప్రదించాలి. ఈ సందర్భంగా ఎయిడ్ ఎట్ యాక్షన్ నవంబర్ 23న ‘రన్ ఫర్ యాక్షన్’ కార్యక్రమాన్ని హైదరాబాద్ సహా 58 నగరాల్లో నిర్వహించనుంది.