విజయం వైపు దూసుకు పోతున్నాం: కేటీఆర్
విజయం వైపు దూసుకు పోతున్నాం: కేటీఆర్
Published Tue, Jan 26 2016 11:13 AM | Last Updated on Sun, Sep 3 2017 4:21 PM
టీఆర్‌ఎస్‌లో చేరిన మాజీ మంత్రులుకృష్ణయాదవ్, పడాల భూమన్న
పలువురు మాజీ కార్పొరేటర్లు
హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ అసాధారణ విజయం వైపు దూసుకుపోతోందని రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. విపక్ష నేత షబ్బీర్ అలీ వంద సీట్లు గెలవాలని సవాలు విసిరారని.. ఆయన కోరిక మేరకు మరో వారం రోజులు కష్టపడి వంద కార్పొరేటర్ స్థానాలను గెలుచుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సోమవారం తెలంగాణ భవన్ లో జరిగిన కార్యక్రమంలో మాజీ మం త్రులు కృష ్ణయాదవ్, పడాల భూమన్న, మాజీ కార్పొరేటర్లు దిడ్డి రాంబాబు తదితరులు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రేటర్‌లో స్థిరపడిన సీమాంధ్రులకు రక్షణ కల్పిస్తామంటున్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గాంధీభవన్‌ను రక్షించుకోలేక పోతున్నారన్నారు. ఆయనకూ రక్షణ లేదని గూట్లో రాయి తీయనోడు ఏట్లో రాయి తీస్తానని ప్రగల్భాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశా రు. ప్రస్తుతం గాంధీభవన్‌కు తాళం పడిందని.. టీడీపీ టిక్కెట్లు రాక ఆ పార్టీ నేతలు అర్థనగ్న ప్రదర్శనలు చేస్తున్నారని.. బీజేపీ కార్యాలయంలో కుర్చీలు గాల్లోకి లేస్తున్నాయన్నారు.
పద్ధతి ప్రకారం నడుస్తున్న పార్టీ టీఆర్‌ఎస్ ఒక్కటేనన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన నాయకుడన్నారు. మరో పదేళ్లలో హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామన్నారు. గతం లో కాంగ్రెస్, మజ్లిస్, టీడీపీ, బీజేపీలకు అవకాశం ఇచ్చిన నగరప్రజలు ఈసారి టీ ఆర్‌ఎస్‌కు అవకాశం ఇవ్వాలని, యాభై ఏళ్ల లో వారు చేయని అభివృద్ధిని ఐదేళ్లలో చేసి చూపుతామన్నారు.
ఏం చేశాయో చెప్పి ఓట్లు అడగాలి...
కాంగ్రెస్, టీడీపీ నాయకులు తమకు ఓట్లు వేయాలని ప్రజల వద్దకు వెళుతున్నారని.. ముందు వాళ్లు నగరానికి ఏం చేశారో చెప్పి ఓట్లు అడగాలన్నారు. వాళ్లు గతంలో హైదరాబాద్ ప్రజలను చావ చితగ్గొట్టారన్నారు. వారి హయాంలో నగరం పరిస్థితి ఊపర్ శేర్వానీ అందర్ పరేషానీ అన్న తరహాలో ఉండేదన్నారు.
తాము అందరినీ సమభావంతో చూస్తూ అన్నివర్గాలను కలుపుకొని ముందుకెళ్తున్నామన్నారు. గల్లీ ప్రజలే తమ బాస్‌లన్నారు. కార్యక్రమంలో రహదారులు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామంతాపూర్, హబ్సిగూడా, జూబ్లీహిల్స్ ప్రాంతాలకు చెందిన పలువురు టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్‌నేతలు, మాజీ కార్పొరేటర్లకు మంత్రు లు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Advertisement
Advertisement