
హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా కనకయ్య
కార్యదర్శులుగా పాశం సుజాత, గోపిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా జెల్లి కనకయ్య ఎన్నికయ్యారు. తన సమీప ప్రత్యర్థి రేసు మహేందర్‌రెడ్డిపై 157 ఓట్ల తేడాతో ఆయన గెలుపొందారు. ఉపాధ్యక్షుడిగా ఎస్.సురేందర్‌రెడ్డి, కార్యదర్శులుగా పాశం సుజాత, గోపిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డిలు ఎన్నికయ్యారు.
సంయుక్త కార్యదర్శిగా సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కోశాధికారిగా నగేశ్ దారా, క్రీడలు, సాంస్కృతిక కార్యదర్శిగా అరవింద్ కుమార్ కాటా విజయం సాధించారు. వీరితో పాటు మరో 13 మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా ఎన్నికయ్యారు. వీరంతా ఏడాది పాటు ఆయా పదవుల్లో కొనసాగనున్నారు.