
కాళోజీ ఆరోగ్య వర్సిటీ లోగో ఖరారు
సాక్షి, హైదరాబాద్: వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయానికి సంబంధించి కొత్త అధికారిక లోగోను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు.