ఉద్యోగుల శాశ్వత విభజనపై మార్గదర్శకాలు వెల్లడించాలని కమలనాథన్ కమిటీకి విజ్ఞప్తి చేసినట్లు టీఆర్ఎస్ నాయకుడు, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
ఉద్యోగుల శాశ్వత విభజనపై మార్గదర్శకాలు వెల్లడించాలని కమలనాథన్ కమిటీకి విజ్ఞప్తి చేసినట్లు టీఆర్ఎస్ నాయకుడు, మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ తెలిపారు. గురువారం హైదరాబాద్లో కమలనాథన్ కమిటీతో శ్రీనివాస్ గౌడ్తోపాటు తెలంగాణ ఉద్యోగ సంఘం నేతలు భేటీ అయ్యారు. అనంతరం శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ... ఎక్కడి వారు అక్కడే పని చేసేలా అవసరమైతే సూపర్ న్యూమరరీ పోస్టులు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు.