అందులో వరి విస్తీర్ణం మాత్రం గణనీయంగా పడిపోయింది. వరి సాధారణ సాగు విస్తీర్ణం 23.35 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 18.32 లక్షల (78%) ఎకరాల్లో మాత్రమే నాట్లు పడ్డాయి. ఇక పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 10.55 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 9.22 లక్షల (88%) ఎకరాలకే పరిమితమైంది. అందులో కంది సాధారణ సాగు విస్తీర్ణం 6.95 లక్షల ఎకరాలకు గాను 6.25 లక్షల ఎకరాలు సాగైంది.
95.50 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగు
Published Thu, Sep 14 2017 1:56 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
వరి నాట్లు 78 శాతానికే పరిమితం
సాక్షి, హైదరాబాద్: ఖరీఫ్ పంటలు 95.50 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. సాధారణ సాగు విస్తీర్ణంతో పోలిస్తే 88.34 శాతం విస్తీర్ణంలో సాగైనట్లు వ్యవసాయ శాఖ బుధవారం విడుదల చేసిన నివేదికలో తెలిపింది. అత్యధికంగా పత్తి పంట సాగుకావడం గమనార్హం. పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 41.9 లక్షల ఎకరాలు కాగా, అంచనాలకు మించి ఏకంగా 46.85 లక్షల (111%) ఎకరాల్లో సాగైంది. పంటల్లో ఆహారధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 48.70 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 39.97 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి.

Advertisement