
గోల్డ్ స్మగ్లింగ్ సూత్రధారి అరెస్టు
గత కొంత కాలంగా విదేశాల నుంచి హైదరాబాద్కు భారీ మొత్తంలో బంగారం స్మగ్లింగ్ చేయిస్తున్న ముఠాలోని కీలక సూత్రధారి అరెస్టయ్యాడు. పాతబస్తీలోని బార్కాస్ ప్రాంతానికి చెందిన సయ్యద్ సాజిద్ అలియాస్ అలియాస్ అజ్జును తూర్పు మండలం పోలీసులు అరెస్టు చేశారు. అతడివద్ద దాదాపు 93 లక్షల రూపాయల విలువ చేసే విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.
ప్రధానంగా దుబాయ్, సింగపూర్, మలేషియా దేశాల నుంచి హైదరాబాద్‌కు బంగారాన్ని స్మగ్లింగ్ చేయిస్తున్న ముఠాలో సాజిద్ కీలక సభ్యుడని పోలీసులు తెలిపారు. చాలా కాలంగా ఆయా దేశాల నుంచి పెద్ద మొత్తంలో బంగారం వస్తుండటం, అడపాదడపా కొద్ది మొత్తంలో బంగారం కూడా విమానాశ్రయంలో పట్టుబడుతుండటం తెలిసిందే. ఈ మొత్తం వ్యవహారం పాతబస్తీ కేంద్రంగా సాగుతున్నట్లు తాజా అరెస్టుతో వెల్లడైంది.