తెలంగాణ ప్రజల ఉద్యమ ఆకాంక్షలను అమలుచేయడంలో ఈ మూడేళ్ల కాలంలో ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం విమర్శించారు.
తెలంగాణ అస్తిత్వాన్ని సమగ్రంగా పరిరక్షించే ప్రయత్నంలో ప్రభుత్వ వైఫల్యం చెందిందన్నారు. ఈ మూడేళ్లలో ప్రజల్లో నిరాశ పెరిగిందన్నారు. రైతులకు బేడీలు, ధర్నాచౌక్ ఎత్తివేత, నిరుద్యోగుల నిరాశ వంటివి దేనికి సంకేతాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో భూమిని సేకరిస్తున్న పద్ధతి దుర్మార్గంగా ఉందని విమర్శించారు.