రేపు సగం సిటీకి కృష్ణా నీళ్లు బంద్ | Krishna water to the city in half strike tomorrow | Sakshi
Sakshi News home page

రేపు సగం సిటీకి కృష్ణా నీళ్లు బంద్

Published Mon, Feb 8 2016 12:15 AM | Last Updated on Wed, Aug 29 2018 9:29 PM

రేపు సగం సిటీకి  కృష్ణా నీళ్లు బంద్ - Sakshi

రేపు సగం సిటీకి కృష్ణా నీళ్లు బంద్

 సిటీబ్యూరో: కృష్ణా మూడోదశ పైప్‌లైన్ మరమ్మతు పనుల కారణంగా ఈనెల 9న(మంగళవారం)సగం సిటీకి కృష్ణాజలాల సరఫరా నిలిచిపోనుంది. సచివాలయంతోపాటు శివారు మున్సిపల్ సర్కిళ్లు, పాతనగరంలోని పలు ప్రాంతాలకు 24 గంటలపాటు (మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బుధవారం ఉదయం 6 గంటలవరకు) నీటిసరఫరా నిలిపివేయనున్నట్లు జలమండలి ప్రకటించింది.

దీంతో చర్లపల్లి, బిట్స్, ఈసీఐఎల్, సైనిక్‌పురి, ఏఎస్‌రావునగర్, సెంట్రల్ ప్రిజన్, ఎంఈఎస్, కంటోన్మెంట్, ఐసీఐసీఐ నాలెడ్జ్‌పార్క్, తుర్కపల్లి, లాలాపేట్, తార్నాక, నాచారం పారిశ్రామికవాడ, మౌలాలి, గాయత్రీనగర్, సాయినాధ్‌పురం, గోకుల్‌నగర్, డిఫెన్స్‌కాలనీ, సైనిక్‌పురి, ఆర్.కె.పురం, మల్కాజ్‌గిరి, మీర్జాలగూడా, సఫిల్‌గూడా, ఆనంద్‌భాగ్, గౌతంనగర్, పాత, కొత్త అల్వాల్, లోతుకుంట,ఫాదర్‌బాలయ్యకాలనీ, హౌజింగ్‌బోర్డు కాలనీ, కైలాస్‌గిరీ, నాచా రం, మల్లాపూర్, ప్రశాసన్‌నగర్, గచ్చిబౌలి, ఫిలింనగర్, మాదాపూర్, కూకట్‌పల్లి, హౌజింగ్‌బోర్డు, హుడా చందానగర్, బీఎన్‌రెడ్డినగర్, ఎల్బీనగర్, ఆటోనగర్, వనస్థలిపురం, సరూర్‌నగర్, అల్కాపురి, దిల్‌సుఖ్‌నగర్, ఆర్‌జికె బండ్లగూడ, ఉప్పల్, బీరప్పగడ్డ, మైలార్‌దేవ్‌పల్లి, మధుబన్, పీడీపీ, హైదర్‌గూడ, రాజేంద్రనగర్, ఉప్పర్‌పల్లి, సులేమాన్‌నగర్, ఎంఎంపహాడ్, అత్తాపూర్, చింతల్‌మెట్, మెహిదీపట్నం, కార్వాన్, లంగర్‌హౌజ్, కాకతీయనగర్, హుమయూన్‌నగర్, తాళ్లగడ్డ, ఆసిఫ్‌నగర్, ఎంఈఎస్, గంధంగూడ, షేక్‌పేట్, ఓయూకాలనీ, టోలిచౌకి, మల్లేపల్లి, విజయ్‌నగర్‌కాలనీ, రెడ్‌హిల్స్, ఓల్డ్‌ఎమ్మెల్యే క్వార్టర్స్, నాంపల్లి, మసాబ్‌ట్యాంక్,లక్డీకాపూల్, సచివాలయం, జియాగూడ, ఆళ్లబండ, గోడేకీకబర్ ప్రాంతాలకు నీటిసరఫరా నిలిపివేయనున్నట్లు తెలిపింది. మరమ్మతుల అనంతరం సరఫరా పునరుద్ధరిస్తామని పేర్కొంది.
 
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement