హైదరాబాద్: ప్రజలు ఎంటు ఉంటే నాయకులు అటువైపు వెళతారని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కే తారక రామారావు అన్నారు. ఇటీవల టీఆర్ఎస్ పార్టీలోకి వివిధ పార్టీ నేతల వలసలు పెరుగుతున్న నేపథ్యంలో కేటీఆర్ ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు. సోమవారం వివిధ పార్టీల నేతలు కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. 'తెలంగాణ ఏర్పడ్డాక ప్రధాని నరేంద్రమోదీ ఇటు వైపే రాలేదు. ఇక్కడి ప్రజలకు ప్రధాని ఎలా ఉంటారో తెలియదు' అన్నారు. జాతీయ పార్టీలకు కాలం చెల్లిందన్న ఆయన భవిష్యత్తు ప్రాంతీయ పార్టీలదే అని స్పష్టం చేశారు. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే హక్కు చంద్రబాబు, జానారెడ్డిలకు లేదని కేటీఆర్ విమర్శించారు.