వరంగల్, ఖమ్మం ప్రచారానికి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థుల తరపున రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రచారంలో పాల్గొననున్నారు. గురువారం ఖమ్మంలో ప్రచారం చేస్తారు. ఉదయం 9 గంటలకు పాండురంగాపురం వద్ద రోడ్డు షో మొదలు పెట్టి రాత్రి 9 గంటల దాకా ప్రచారంలో పాల్గొంటారు.
శుక్రవారం గ్రేటర్ వరంగల్‌లో రోడ్ షోలో పాల్గొంటారు. ఈ రెండు నగరాల్లో సమస్యలు, వాటి పరిష్కారానికి టీఆర్‌ఎస్ పార్టీ తరపున ఇవ్వాల్సిన హామీలపై మంత్రి ఆ రెండు జిల్లాల మంత్రులు, నాయకులతో చర్చించారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా ప్రతిపక్షాలపై పూర్తిస్థాయిలో పైచేయి సాధిం చే వ్యూహంలో భాగంగా ఈ ఎన్నికలను పార్టీ సవాల్‌గా తీసుకుంది.