శంషాబాద్ ఎయిర్‌పోర్టు రోడ్డులో శనివారం మధ్యాహ్నం పెను ప్రమాదం తప్పింది.
ఎయిర్‌పోర్టు రోడ్డులో తప్పిన ప్రమాదం
Published Sat, Sep 24 2016 5:05 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM
హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టు రోడ్డులో శనివారం మధ్యాహ్నం పెను ప్రమాదం తప్పింది. భారీ వర్షాల కారణంగా శ్రీశైలం హైవే నుంచి ఎయిర్‌పోర్టు ప్రవేశ మార్గానికి వెళ్లే దారిలో కొండచరియలు విరిగి రోడ్డుపై పడ్డాయి. ఆ సమయంలో అటువైపు ఎలాంటి వాహనాలు రాకపోవటంతో ప్రమాదం తప్పినట్లైంది. అప్రమత్తమైన జీఎంఆర్ సిబ్బంది అక్కడ బారికేడ్లను ఏర్పాటు చేసి వాహనదారులను అప్రమత్తం చేశారు. సమాచారం తెలుసుకున్న అధికారులు క్రేన్లను రంగంలోకి దించి కొండచరియలను తొలగించే పనులను చేపట్టారు.
Advertisement
Advertisement