మెదడు మాట విందాం | let us listen to brain | Sakshi
Sakshi News home page

మెదడు మాట విందాం

Published Sun, Jan 18 2015 11:50 PM | Last Updated on Sat, Sep 2 2017 7:52 PM

మెదడు మాట విందాం

మెదడు మాట విందాం

ఉన్నత ఉద్యోగం, డబ్బు, ఇల్లు, ఇల్లాలు, పిల్లలు..  అన్నీ ఉన్నా.. ఏదో తెలియని బాధ మనిషిని వేధిస్తూనే ఉంది. గజి‘బిజీ’ సిటీలో మారుతున్న జీవనశైలిలో ఇమడలేక కొందరు.. సిటీలైఫే రియల్ లైఫ్ అని భ్రమల్లో మరికొందరు.. మదిలో మెదులుతున్న భావాలను మైండ్‌తో కనెక్ట్ చేసుకోలేక డిప్రెషన్‌లోకి వెళ్తున్నారు. మైండ్‌సెట్‌ని కాస్త ట్యూన్ చేసుకుంటే చాలు మీరు కోల్పోతున్న ఆనందాన్ని పొందవచ్చు అంటున్నారు వెనరబుల్ తెన్‌జిన్ ప్రియదర్శి రిన్‌పోచె. దలైలామా సెంటర్ ఆఫ్ ఎథిక్స్ అండ్ ట్రాన్స్‌ఫర్మేటివ్ వాల్యూస్ మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫౌండర్, డెరైక్టర్ అయిన తెన్‌జిన్ పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనను సిటీప్లస్ పలకరించింది.                            
..:: ఓ మధు
 
వెనరబుల్ తెన్‌జిన్ ప్రియదర్శి రిన్‌పోచె బీహార్‌లో జన్మించారు. పదేళ్ల వయసులోనే సన్యాసం స్వీకరిస్తానంటూ ఇంటి నుంచి వెళ్లిపోయి రాజ్‌గిర్‌లోని బౌద్ధధామం చేరుకున్నారు. తనను తాను అన్వేషించుకుంటూ ధ్యానంలో మునిగిపోయారు. బౌద్ధగురువు దలైలామా దగ్గర సన్యాస దీక్ష తీసుకున్నారు. అమెరికాలోని హార్‌వర్డ్ యూనివర్సిటీలో ఫిలాసఫీలో పట్టా పొందారు. తర్వాత మదర్ థెరిసా నిర్వహించిన సేవాకార్యక్రమాల్లో కొంత కాలం పాలుపంచుకున్నారు. అక్కడే మానవత్వం, కరుణ ఆకలింపు చేసుకున్నారు.
 
ప్రముఖ హీరోయిన్ ఈ మధ్యే యాంగ్జైటీ, డిప్రెషన్‌కి లోనయ్యానని ప్రకటించింది. సక్సెస్, పేరు, డబ్బు, సుఖం అన్నీ ఉన్నా ఇలాంటి డిప్రెషన్‌కి కారణం ఏమంటారు.. ? ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ఇబ్బందులు చాలామందికి ఎదురవుతున్నాయి. దీనికి కారణం మన లైఫ్‌స్టైల్‌కి అనుగుణంగా మైండ్‌ని అడ్జెస్ట్ చేసుకోలేకపోవడమే. కొందరు తమ సామర్థ్యానికి మించి పని చేస్తుంటారు. అప్పుడు ఇలాంటి యాంగ్జైటీ, డిప్రెషన్ తలెత్తుతాయి. మైండ్ ట్రైనింగ్ ద్వారా మనలోని అంతర్గత విరోధాలను అధిగమించవచ్చు.
 
ఆహ్వానంగా భావించండి..
నా ప్రియారిటీస్ ఏంటని ఆలోచించుకోవాలి.. వాటిని గుర్తించాలి.. ఆచరించాలి. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుంటూనే.. సంతోషాన్ని కలిగించే అంశాల నుంచి డిస్ట్రాక్ట్ కాకుండా జీవిత లక్ష్యం ఏర్పర్చుకోవాలి. సంతోషంగా ఎందుకు ఉండలేకపోతున్నామని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అప్పుడే నిజమైన సంతృప్తి కలిగించేవి ఏమిటో తెలుసుకోగల్గుతారు. అందుకే మీ డిప్రెషన్ కలిగినపుడు సమస్యగా ఫీలవ్వొద్దు. మీ గురించి తెలుసుకోవడానికి ఆహ్వానంగా భావించాలి.
 
ఒత్తిడిలో యువత..
మన జీవనశైలి గురించి ఒకసారి గమనిస్తే చాలు మనలోని యాంగ్జైటీ గురించి తెలుసుకోవచ్చు. సరిగా నిద్ర పోగలుగుతున్నామా, మైండ్ స్ట్రెస్‌కి లోనవుతోందా.. ఆలోచనల్లో చికాకులు, నమ్మకం సన్నగిల్లడం.. ఇలాంటివి మీకు ఎదురైతే.. మీ మనసును, మెదడును నెగిటివ్ ఫీలింగ్స్ ఎఫెక్ట్ చేస్తున్నాయని గ్రహించాలి. అన్ని వయసుల వారూ ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. భారత భవితగా చెప్పుకునే నేటి యువత తీవ్రమైన ఒత్తిడిలో ఉంటోంది. పోటీ ప్రపంచంలో పక్కన వాళ్ల కంటే మెరుగ్గా ఉండాలని, కెరీర్‌లో విజయం సాధించాలని ఒక ఆర్టిఫిషియల్ వాతావరణంలో చాలా సవాళ్లు ఎదుర్కుంటోంది.
 
ఆ ఆలోచన మొదలైతే..
జీవన ప్రయాణంలో ఎవరికి వాళ్లు.. ఎప్పటికప్పుడు ఏం చేస్తున్నారనే విషయాన్ని అర్థం చేసుకుంటూ ముందుకు సాగాలి. తమ ఐడెంటిటీ తెలుసుకునే ప్రయత్నం చేస్తుండాలి. జీవిత పరమార్థం, లక్ష్యం గురించి మథనం జరపాలి. భవిష్యత్తు గురించి ఆలోచన మొదలైతే యువత జీవితం సవ్యంగా సాగుతుంది.
 
ఆ చాన్స్ వారికే ఇవ్వండి..

తమ బిడ్డలు ఉన్నతంగా సెటిల్ కావాలని, కార్లలో తిరగాలని.. తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. మంచిదే కానీ, నా బిడ్డ అతనిలా ఉండాలి, ఆమెలా పేరు తెచ్చుకోవాలని వారిపై ప్రెషర్ పెంచుతున్నారు. ఇతరులతో కంపేర్ చేస్తూ వీరి జీవితాన్ని ముందుకు తోస్తున్నారు. దీని వల్ల అనవసరమైన ఒత్తిడి పిల్లల మీద పడుతోంది. మీ పిల్లల సంతోషం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయండి. వారి భవిష్యత్తును వారే నిర్ణయించుకునే స్వేచ్ఛ ఇస్తే ఎంతో మేలు చేసిన వారవుతారు.
 
ఎవరికి వారు వారి మైండ్‌లో జరుగుతున్న విషయాలు తెలుసుకోవడానికి, ట్రాన్స్‌ఫాం చేసుకోవడానికి ఉపయోగపడే ఒక మెథడ్ మైండ్ ట్రైనింగ్. కోపం, అసూయ, నిరాశ వంటి నెగిటివ్ విషయాలను మార్చుకోవడానికి ఇది సాయపడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement