ఏకంగా 'లారీ' కొట్టేశారు
రంగారెడ్డి: ఇన్నిరోజులూ మనుషుల్ని కొట్టి, భయపెట్టి వారి వద్ద ఉన్న ఆభరణాలు, డబ్బులు కాజేశే వారు. ఇపుడు ఏకంగా పెద్ద వాహనాలకే టెండర్ వేశారు హైదరాబాద్ నగరంలోని దొంగలు. వారి ఆటలు రోజురోజుకీ మారిపోతున్నాయి...అలాగే పెరిగిపోతున్నాయని కూడా చెప్పాలి. సోమవారం ఏకంగా లారీ డ్రైవర్ని చితకబాది, లారీతో పరారయ్యారు.
ఈ సంఘటన రంగారెడ్డి జిల్లాలో ఔటర్ రింగురో్డ్డుపై జరిగింది. పెద్ద అంబర్ పేట నుంచి తుక్కుగూడ వైపు వస్తున్న లారీ (AP29 TB 115) పై దారిలో దుండగులు దాడి చేశారు. అడ్డు వచ్చిన డ్రైవర్ను చితకబాదారు. తరువాత లారీతో పరారయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.