హైదరాబాద్: ఫేస్‌బుక్‌లో పరిచయమైన అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసి నగలను అపహరించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన నగరంలోని ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న యువతికి ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన ఓ యువకుడు ఆమె ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టి తన పరువు తీస్తానని బెదిరించాడు. ఫొటోలను ఇవ్వాలంటే నగలు ఇవ్వాలని బెదిరింపులకు దిగాడు. దీంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆ యువతి ద్వారా యువకుడిన కామినేని హాస్పటల్ వద్దకు వస్తే నగలు ఇస్తానని చెప్పించారు. దీంతో శుక్రవారం ఉదయం హాస్పిటల్ వద్దకు వచ్చిన యువకుడు నగలు తీసుకుంటుండగా అక్కడే మఫ్టీలో ఉన్న పోలీసులు అతనిని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.