వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నారని.. | Man attack on Wife and two children with knife | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నారని..

Published Sun, Apr 10 2016 10:32 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

Man attack on Wife and two children with knife

వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నారనే కోపంతో ఓ వ్యక్తి భార్య ఇద్దరు పిల్లలపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ సంఘటన నగరంలోని కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని రత్నానగర్‌లో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది.

 స్థానికంగా నివాసముంటున్న సుందర్ భార్యా పిల్లలను నిర్లక్ష్యం చేస్తూ.. వివాహేతర సంబంధం నడుపుతున్నాడు. ఈ విషయం పై గత కొన్ని రోజులుగా ఇంట్లో కలహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం కుటుంబంలో గొడవ జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన సుందర్ కత్తితో ఇద్దరు పిల్లలు సహా భార్యపై దాడి చేశాడు. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను గాంధీ ఆస్పత్రికి తరలించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement