మామిడి కొనుగోళ్ల నిలిపివేత: హరీష్ ఆగ్రహం
Published Mon, Apr 10 2017 11:05 AM | Last Updated on Tue, Oct 9 2018 4:55 PM
హైదరాబాద్ : కొత్తపేట గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌లో మామిడి కొనుగోళ్ల నిలిపివేతపై మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ‍్యక‍్తం చేశారు. మామిడి కొనుగోళ్ల నిలిపివేత సరికాదు.. తక్షణమే కొనుగోళ్లను ప్రారంభించాలని వ్యాపారులను ఆదేశించారు. కొనుగోళ్లు ప్రారంభించక పోతే వ్యాపారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంత్రి ఆదేశం మేరకు మార్కెట్ కమిటీ ఛైర్మన్ పురుషోత్తం సమక్షంలో వ్యాపారులతో చర్చలు జరుపుతున్నారు.
కార్బైడ్, చైనా పౌడర్‌ను ఉపయోగించి మామిడికాయలను మార్కెట్‌కి తీసుకు వస్తున్నారని వ్యాపారస్తులు కొనుగోళ్లు నిలిపివేశారు. నిబంధనలకు విరుద్ధంగా కార్బైడ్ వాడుతున్నారంటూ 92 దుకాణాలకు లైసెన్స్‌లు రద్దు చేస్తూ మార్కెటింగ్ శాఖ నోటీసులు జారీ చేసింది. మరో వైపు సోమవారం ఉదయం మంత్రి జూపల్లి కృష్ణారావు గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌లో పర్యటించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతుల సమస్యలు పరిష్కరిస్తానని మంత్రి హామీనిచ్చారు.
Advertisement
Advertisement