హైదరాబాద్ : కార్మికుల హక్కులను కాలరాస్తే ఖబడ్దార్ అంటూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి హెచ్చరించారు. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్లు కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. గాంధీ భవన్‌లో ఆదివారం ఘనంగా మే డే వేడుకలు జరిగాయి. ఐఎన్‌టీయూసీ కార్మిక సంఘం జెండాను ఉత్తమ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కార్మికుల హక్కుల సాధన కోసం వారికి అండగా ఉంటామని ప్రకటించారు.