జనవరిలో మెట్రో ట్రయల్ రన్!
సీఎస్ సమీక్షలో నిర్ణయం
సిటీబ్యూరో: నగరవాసులకు నూతన సంవత్సర కానుకగా నాగోల్-మెట్టుగూడా రూట్లో మెట్రో రైలు ట్రయల్ రన్‌ను జనవరిలోనే నిర్వహించాలని ఎల్‌అండ్‌టీ, హెచ్‌ఎంఆర్ వర్గాలు ప్రాథమికంగా నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. బుధవారం సచివాలయంలో మెట్రో పనుల పురోగతిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ సేఫ్టీ సర్టిఫికెట్ (భద్రత)జారీ చేసిన అనంతరమే ట్రయల్ రన్ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది. కాగా నాంపల్లి, బేగంపేట్, ఖైరతాబాద్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో ప్రధాన రహదారులపై మెట్రో పనులు చేపట్టేందుకు వీలుగా 283 ఆస్తుల సేకరణ ప్రక్రియను సత్వరం పూర్తిచేయాలని సీఎస్‌జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు.
ఇప్పటికే ఇందులో సగానికిపైగా ఆస్తులను సేకరించి, బాధితులకు పరిహారం అందజేసినట్లు సంబంధిత అధికారులు వివరించారు. కాగా ప్రస్తుతం నాగోల్-మెట్టుగూడా (8 కి.మీ.) మార్గంలో నిత్యం 8 మెట్రో రైళ్లకు 18 రకాల ప్రయోగపరీక్షలు(టెస్ట్న్)్ర నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇదే మార్గంలో మార్చి 21,2015 (ఉగాది) రోజున మెట్రో ప్రాజెక్టును లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ సమావేశంలో హెచ్‌ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి, ఎల్‌అండ్‌టీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.