మెట్రో సొబగులు చూతము రారండి | details of metro project | Sakshi
Sakshi News home page

మెట్రో సొబగులు చూతము రారండి

Published Wed, Sep 3 2014 1:31 AM | Last Updated on Tue, Oct 16 2018 5:04 PM

మెట్రో సొబగులు చూతము రారండి - Sakshi

మెట్రో సొబగులు చూతము రారండి

సాక్షి, సిటీ బ్యూరో: మెట్రో ప్రాజెక్టులో ప్రతి అంశమూ ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా నాగోల్-మెట్టుగూడ రూట్లో రూపుదిద్దుకుంటున్న నాగోల్, ఉప్పల్ మెట్రో స్టేషన్లతో పాటు, ఉప్పల్ మెట్రో డిపో చూపరులను కట్టిపడేస్తోంది. ఆ విశేషాలు చూస్తే...
 
స్టేషన్ ఇలా ఉంటుంది...

స్టేషన్‌ను మూడు భాగాలుగా విభజిస్తారు. మొదటిది స్ట్రీట్ లెవల్, రెండోది మధ్యభాగం (కాన్‌కోర్స్), మూడోది ప్లాట్‌ఫారం, మధ్యభాగంలోనే ప్రయాణికులకు కావాల్సిన షాపింగ్ మాల్స్, ఫుడ్‌కోర్టులు ఉంటాయి.

స్టేషన్ మధ్యభాగం (కాన్‌కోర్స్‌లో) పెయిడ్, అన్‌పెయిడ్ ఏరియాలు వేర్వేరుగా విభజిస్తారు. పెయిడ్ ఏరియాలోకి ప్రవేశించిన తరవాత అక్కడి నుంచి 22 అడుగుల ఎత్తునున్న ప్లాట్‌ఫారంపైకి నేరుగా చేరుకునేందుకు 4 చోట్ల మెట్లు, రెండు లిఫ్టులు, 4 ఎస్కలేటర్లు ఇరువైపులా ఉంటాయి.
     
మెట్రో రైలు స్టేషన్ పొడవు 140 మీటర్లు, వెడల్పు 20 మీటర్లు.
స్టేషన్‌లోకి చేరుకునేందుకు రోడ్డుకు ఇరువైపులా రెండు చోట్ల మెట్లు, ఒక ఎస్కలేటరు, ఒక లిఫ్టు ఉంటాయి.
ప్రతి స్టేషన్ ను 228 ప్రీకాస్ట్ సెగ్మెంట్లతో నిర్మిస్తారు.
కాంక్రీటు నిర్మాణం 5 వేల క్యూబిక్ మీటర్లు ఉంటుంది.
స్టేషన్ నిర్మాణంలో బైండింగ్ స్టీలు 60 వేల మీటర్లు (సుమారు 60 కి.మీ) వినియోగించారు.
ఇతర నిర్మాణాలకు స్టీలు వినియోగం: 230 మెట్రిక్ టన్నులు.
స్టేషన్ పైకప్పు (రూఫ్‌షీటింగ్): 35 వేల చదరపు అడుగులు.
ప్రతి స్టేషన్‌లో ఫ్లోరింగ్: 50 వేల చదరపు అడుగులు.
 స్టేషన్‌లో ఫుడ్‌కోర్టులు, షాపింగ్,
వాణిజ్య కేంద్రాల నిడివి: స్టేషన్ స్థాయిని బట్టి 10 వేల నుంచి 37 వేల చదరపు అడుగుల్లో ఉంటాయి.
నీటి నిల్వ సామర్థ్యం: 1.30 లక్షల లీటర్లు.
స్టేషన్ లోపల విద్యుత్, సిగ్నలింగ్, టెలికాం విభాగాలకు సంబంధించి 40 కి.మీ మేర కేబుల్ వ్యవస్థ ఉంటుంది.
ప్లాట్‌ఫారం వెడల్పు: 21 అడుగులు.


 ఉప్పల్ డిపో ప్రత్యేకతలివీ..
   
ట్రాక్పొడవు: 11 కి.మీ
ప్రస్తుతం ఈ డిపోలో ఉన్న రైళ్లు: ఏడు (ఒక్కో రైలుకు 3 భోగీలు)
డిపో నిర్మాణానికి వినియోగించిన మట్టి: 60 వేల ట్రక్కులు.
ప్రహరీ: మూడు కిలోమీటర్లు.
వినియోగించిన కాంక్రీటు: 65 వేల క్యూబిక్ మీటర్లు
వాడిన స్టీలు: 1200 మెట్రిక్ టన్నులు
పైకప్పునకు: 1.90 లక్షల చదరపు అడుగుల మేర రూఫ్‌షీటింగ్.
డ్రైనేజ్ వ్యవస్థ నిడివి: 35 కి.మీ.
అంతర్గత రహదారులు: 5 కి.మీ.
భారీ క్రేన్లు: 6
టర్న్‌టేబుల్స్ (ఒక దిశ నుంచి మరో దిశకు రైలు కోచ్ మారేందుకు): 7

 
మొత్తం కంట్రోల్ ఇక్కడి నుంచే..
మొత్తం మూడు కారిడార్లలో 72 కి.మీ మెట్రో మార్గాన్ని కమ్యునికేషన్ బేస్డ్ ట్రెయిన్ కంట్రోల్ సిస్టం, డ్రైవర్ లెస్ టెక్నాలజీ ఆధారంగా నిర్వహించనున్నారు. ప్రతి రైలులో డ్రైవర్ ఉన్నప్పటికీ ఆయన పని కేవలం స్టేషన్‌లో 20 సెకన్ల పాటు రైలు ఆగినపుడు డోర్లు తెరుచుకునే, మూసుకునే బటన్ నొక్కడమే. ఇందుకోసం ఉప్పల్ మెట్రో డిపో ప్రాంగణంలో అత్యాధునిక ఆపరేషన్ కంట్రోల్ సెంటర్ (ఓసీసీ)ను 1.5 లక్షల చదరపు అడుగుల సువిశాల విస్తీర్ణంలో అత్యాధునికంగా నిర్మిస్తున్నారు. దీని నిర్మాణం ప్రస్తుతం తుది దశకు చేరుకుంది. ఇక్కడి నుంచే ఏ మార్గంలో రైలు ఏ స్పీడులో వెళుతుందో... రైలు ఎక్కడ ఉందో ఇట్టే కంప్యూటర్ తెరపై వీక్షించవచ్చు.
 
నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్‌లో మన మెట్రో ప్రస్థానం..

మెట్రో ప్రాజెక్టు నిర్మాణ విశేషాలపై విశ్వవ్యాప్తంగా పేరొందిన నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ ‘కనెక్టింగ్ ది సిటీ ఆఫ్ నిజాం’పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది. ఈ కార్యక్రమాన్ని అక్టోబరు 19న సాయంత్రం 6 గంటలకు ప్రసారం చేయనుందని ఎల్‌అండ్‌టీ వర్గాలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement