
వర్షాకాలానికి ‘మిషన్’ పనులు పూర్తి
మిషన్ కాకతీయ పనులను వర్షాకాలానికి ముందే పూర్తి చేయాలని నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు.
అధికారులకు మంత్రి హరీశ్‌రావు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: మిషన్ కాకతీయ పనులను వర్షాకాలానికి ముందే పూర్తి చేయాలని నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. ఈ నెలాఖరులోపే మొదటి విడత పనులన్నీ పూర్తి చేయాలని సూచించారు. మెదక్ జిల్లా నారాయణఖేడ్ ఎమ్మార్వో కార్యాలయం నుంచి బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మిషన్ కాకతీయ పనుల్లో ఎలాంటి ఫిర్యాదులున్నా 040-23472233 నంబర్‌కు తెలియచేయాలని సూచించారు.
రూ.175.45 కోట్లు మంజూరు..
మెదక్, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో 572 చెరువుల పునరుద్ధరణకు రూ.175.45 కోట్లకు పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ నీటి పారుదలశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌కే జోషి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా మిషన్ కాకతీయకు ప్రకటించిన ప్రత్యేక అవార్డులను ఈ నెల 17న జలసౌధలో మంత్రి హరీశ్‌రావు అందజేస్తారని ఆయన కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.