జియాగూడలో 'డబుల్'కు భూమి పూజ
Published Wed, Jul 26 2017 3:53 PM | Last Updated on Sat, Sep 29 2018 4:44 PM
హైదరాబాద్: నగరంలోని జియాగూడలో నిర్మించనున్న 840 డబుల్ బెడ్ రూముల నిర్మాణాలకు మంత్రి కేటీఆర్ భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మేయర్ బొంతు రాంమోహన్, డిప్యూటీ సీయం మహమూద్ ఆలీ, నాయిని నర్సింహారెడ్డి, డిప్యూటి మేయర్ బాబా ఫసియుద్దిన్ తదితరులు హాజరయ్యారు.
జియాగూడలో 12 బ్లాక్ లలో సిల్ట్ ప్లస్ ఫైవ్ నిర్మాణాలు చేపట్టనున్నారు. దీని ద్వారా 840 కుటుంబాలు లబ్ధిపొందనున్నాయి. ఒక్కో ఇంటి నిర్మాణానికి 8 లక్షల యాబై వేల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేయనుంది. పన్నెండు నెలల్లో నిర్మాణాలను జీహెచ్‌ఎంసీ పూర్తి చేయనుంది.
Advertisement
Advertisement