jiyaguda
-
వైకుంఠ ద్వారం గుండా భక్తులకు ప్రత్యేక దర్శనాలు
-
ఉత్తరద్వార దర్శనం చేసుకుంటున్న ఉత్తరాంధ్ర జిల్లావాసులు
-
వ్యసనంగా మారిన ‘వీడియోల వైరల్ కిక్’.. అద్దం పట్టిన జియాగూడ హత్యోదంతం
సాక్షి, హైదరాబాద్: ‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు’ అంటూ ప్రముఖ కవి, వాగ్గేయకారుడు అందెశ్రీ రాసిన గీతం సమాజంలో నానాటికీ అడుగంటుతున్న మానవవతా విలువలకు అద్దం పడుతుంది. ఆదివారం జియాగూడలో జరిగిన దారుణ ఉదంతాన్ని కళ్లకు కడుతుంది. పురానాపూల్ వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న అంబర్‌పేట వాసి జంగం సాయినాథ్‌ను అడ్డగించిన ముగ్గురు దుండగులు దారుణంగా హత్య చేశారు. పట్టపగలు, నడిరోడ్డుపై నరికి చంపుతున్నా స్థానికులు చూస్తూ ఊర్కుకున్నారే తప్ప అడ్డుకోవడానికి ముందుకు రాలేదు. జరుగుతున్న ఘోరాన్ని అనేక మంది వీడియో చిత్రీకరించి వైరల్ చేశారు. ఇటీవల కాలంలో ఇలాంటి ఉదంతాలు అనేక చోటు చేసుకున్నాయి. మనుషుల్లో పెరిగిపోతున్న ఈ ధోరణికి కారణాలపై ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయం ప్రొఫెసర్ డాక్టర్ అనిత రాయిరాలను ‘సాక్షి’ అభిప్రాయం కోరగా.. సమాజంలో ఈ పరిస్థితులు తలెత్తడానికి అనేక కారణాలు ఉన్నాయని ఆమె అన్నారు. తాజా పరిస్థితులపై డాక్టర్ అనిత తన అభిప్రాయాన్ని ఇలా వెలిబుచ్చారు. సెన్సేషనలిజాన్ని ఆస్వాదించడానికే... ► కళ్లెదుటే జరుగుతున్న ఘోరాన్ని ఆపడానికి బదులు దాన్ని తమ సెల్ఫోన్లలో చిత్రీకరించే ధోరణి పెరిగిపోయింది. ఆ వీడియో వైరల్ కావడం వల్ల వచ్చే కిక్, ఆ సెన్సేషనలిజాన్ని ఆస్వాదించడానికి కొందరు ఇలా చిత్రీకరిస్తున్నారు. ఈ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ లైక్స్, కామెంట్స్, ఫార్వర్డ్స్‌లో తమ సక్సెస్ వెతుక్కునే వాళ్లు పెరిగిపోయారు. స్మార్ట్ ఫోన్ సామాన్యుడి చేతికి రావడంతో ఈ మీడియా పరిధి పెరిగిపోవడం, ఇందులోని అంశాలు వేగంగా విస్తరించడం తదితర కారణాలతో తమ వీడియో వైరల్ కావడం ఓ కిక్‌గా భావిస్తున్నారు. కొన్నింటిని వైరల్ చేస్తూ అందులో ఆనందాన్ని వెతుక్కుంటున్నారు. ► సోషల్‌మీడియాలో ట్రోలర్స్ ఎవరనేది ఎదుటి వారికి తెలీదు. దీంతో వాళ్లు చేసే కామెంట్స్, పోస్టులు నేరుగా వీళ్లపై ప్రభావం చూపదు. ఈ కారణంగానూ ఘోరాలను వీడియో తీసి వైరల్ చేయడం అనే ధోరణి పెరిగిపోయింది. ప్రస్తుత విద్యా వ్యవస్థ మార్కులు, ర్యాంకుల ఆధారితంగా మారిపోయింది. ఈ పరిస్థితులు మారాలంటే కుటుంబ వ్యవస్థ బలంగా ఉండాలి. తల్లిదండ్రులు, చదువు చెప్పే గురువులు ఆ కోణంలో కృషి చేయాల్సిన అవసరం ఉంది. సామాజిక బాధ్యతలు, విలువలు విద్యలో భాగంగా మారాలి. ప్రతి వ్యక్తి జీవితంలో రోల్ మోడల్స్‌ను ఎంచుకునే విధానం మారాలి. అలా ప్రతి ఒక్కరూ కృషి చేస్తేనే ఫలితాలు ఉంటాయి. హీరోయిజానికి అర్థం మారిపోయింది.. ► ప్రస్తుత సమాజంలో మానవ సంబంధాలు, వాటి విలువలు తగ్గాయి. మనుషులను బట్టే సమాజం కూడా ఉంటుంది. అనేక మంది ఇళ్లల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ప్రతి ఒక్కరిలో స్వార్థం పెరిగిపోవడంతో ఎదుటి వారికి సహాయం చేస్తే నాకేంటి లాభం అని ఆలోచిస్తున్నారు. గతంలో వీరికి సహాయం అవసరమైనప్పుడు ఎవరూ ముందుకు రాకపోవడమూ ఈ ధోరణికి ఓ కారణమే. ► సినిమాలు, మీడియా తదితరాలను కూడా సక్సెస్ అంటే ఉన్నత స్థితికి చేరడం, డబ్బు సంపాదించడం అంటూ.. హీరోయిజమంటే ఎదుటి వారిని కొట్టడం అన్నట్లు చూపిస్తున్నాయి. ఇలాంటి వారికి లభిస్తున్న ప్రచారం పది మందికి సహాయపడిన, పడుతున్న వారికి లభించట్లేదు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ దెబ్బతినడం కూడా మానవ సంబంధాలు, అనుబంధాలు, ఆప్యాయతలు తగ్గిపోవడానికి కారణమైంది. వీటితో పాటు సమాజంలో నిత్యం జరుగుతున్న నేరాలు చూడటం అలవాటుపడిన వాళ్లు తమ కళ్ల ముందే ఘోరం జరుగుతున్నా స్పందించట్లేదు. -ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయం ప్రొఫెసర్ అనిత -
జియాగూడ హత్య కేసు.. చంపింది స్నేహితులే!
సాక్షి, హైదరాబాద్: జియాగూడ హత్య కేసును పోలీసులు చేధించారు. సాయినాథ్‌ను తన స్నేహితులే చంపినట్లు పోలీసులు గుర్తించారు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే బాధితుడిని అక్షయ్, టిల్లు, సోను హత్య చేసినట్లగా పోలీసుల విచారణలో తేలింది. ఘటన జరిగిన 24 గంటల్లోనే నిందితులను అదుపలోకి తీసుకున్నారు. కాగా అంబర్‌పేటకు చెందిన కార్పెంటర్ జంగం సాయినాథ్ అనే వ్యక్తిని ఆదివారం సాయంత్రం జియాగూడలో దుండగులు హత్య చేసిన విషయం తెలిసిందే. సాయినాథ్‌ను ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు అడ్డగించి వేట కొడవలి, రాడ్డుతో నరికి చంపారు. పక్కా పథకం ప్రకారమే ఈ హత్య జరిగినట్లు పోలీసుల దర్యాప్తులో నిర్ధారణకు వచ్చారు. హత్యకు కుట్రపన్నిన నిందితులు సాయినాథ్ కదలికలను గమనిస్తూ వచ్చారని,అతడిని అనుసరిస్తూ వచ్చిన ముగ్గురు అనువైన ప్రదేశం కోసం వెంబడించారని పోలీసులు తెలిపారు. జియాగూడ మేకల మండీ సమీపంలో జనసంచారం లేకపోవటాన్ని అవకాశంగా చేసుకొని నిమిషాల వ్యవధిలో హతమార్చి పారిపోయారని పోలీసులు పేర్కొన్నారు. -
Jiyaguda : దారి కాచి.. దాడి చేసి.. పట్టపగలే కార్పెంటర్ దారుణ హత్య
జియాగూడ: నగరంలోని పురానాపూల్ జాతీయ రహదారిపై పట్టపగలే దారుణం జరిగింది. ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ఒకరిని వేట కొడవలి, రాడ్డుతో నరికి చంపారు. కుల్సుంపురా ఇన్స్పెక్టర్ అశోక్‌కుమార్ చెప్పిన వివరాల ప్రకారం.. అంబర్‌పేట్‌కు చెందిన జంగం సాయినాథ్ (35) కార్పెంటర్‌గా పని చేస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం అతడు కోఠి ఇసామియా బజార్ నుంచి ద్విచక్ర వాహనంపై బయలుదేరి పురానాపూల్ జాతీయ రహదారిలో కార్వాన్ వైపు వెళ్తున్నాడు. బైక్‌పై వస్తున్న సాయినాథ్‌ను ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు అడ్డగించి రాడ్డుతో దాడి చేశారు. కింద పడవేసి వేట కొడవలితో నరికి చంపారు. ఘటనా స్థలానికి క్లూస్‌టీం, పోలీసులు చేరుకుని మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. నిందితులను పట్టుకునే ప్రయత్నం.. జాతీయ రహదారిలో గోషామహల్ ట్రాఫిక్ కానిస్టేబుల్ జనార్దన్ పెట్రోలింగ్ విధుల్లో ఉన్నాడు. సాయినాథ్‌పై దాడి జరుగుతున్నట్లు గమనించాడు. నిందితులను పట్టుకోవడానికి వెళ్లగా వారు మూసీనదిలో దూకి పారిపోయారు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ సాయినాథ్ అప్పటికే మృతి చెందాడు. ఈ దారుణం జరుగుతుండగా.. అక్కడే కొంతమంది ప్రయాణికులు చూస్తూ ఉండిపోయారే తప్ప ఎవరూ ఈ దారుణాన్ని అడ్డుకోలేకపోయారు. ఈ ఘటనను సెల్ఫోన్లలో చిత్రీకరించారు. బైక్‌పై వస్తున్న వ్యక్తిని పథకం ప్రకారమే అడ్డగించి హత్య చేశారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. సాయినాథ్ హత్యకు గల కారణాలు తెలియరాలేదని, కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. జంగం సాయినాథ్ (ఫైల్) చదవండి: డెక్కన్‌మాల్ ఘటన.. దొరకని మృతదేహాలు.. ఇక మిగిలింది బూడిదేనా? -
జియాగూడ రంగనాథ స్వామి ఆలయంలో ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనాలు
-
బతుకులు బుగ్గి! అప్పుడు క్రాకర్స్, ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికిల్స్..
సాక్షి, హైదరాబాద్: రాజధాని నగరంలోని దుకాణాలు, కంపెనీలు, సంస్థలు, గోదాముల్లో అగ్ని ప్రమాదాలు కలవరం రేపుతున్నాయి. నాటి కార్తికేయ లాడ్జి, నేటి రూబీ లాడ్జీ ఉదంతాల్లో మాత్రం ఓ సారూప్యత ఉంది. మొదట అగ్ని ప్రమాదం ఈ రెండింటిలోనూ ప్రారంభంకాలేదు. వీటికి కింది అంతస్తుల్లో ఉన్న దుకాణాల్లో మొదలైన అగ్గి లాడ్జీలో బస చేసిన వారి ఉసురు తీసింది. ప్రమాదాలు ఎలా జరిగాయంటే.. ఉస్మాన్‌గంజ్‌లోని ప్రధాన రహదారిపై ఉన్న భవనం గ్రౌండ్ ఫ్లోర్లో శాంతిఫైర్ వర్క్స్ ఉంది. దీని మొదటి అంతస్తులో కెనరా బ్యాంక్ శాఖ ఉండగా... రెండు, మూడు అంతస్తుల్లో కలిపి కార్తికేయ లాడ్జి నడిచేది. ఈ రెండు ఉదంతాల్లోనూ మృతులు బయటి ప్రాంతాల నుంచి వచ్చినవారే కావడం గమనార్హం. ఘరానా దొంగ మారుతి నయీం 2002 అక్టోబర్ 23న శాంతి ఫైర్ వర్క్స్‌లో చోరీ చేయడానికి వచ్చాడు. తన కారును అడ్డంగా పెట్టి షట్టర్ పగులకొట్టిన నయీం దుకాణంలోకి ప్రవేశించాడు. అందులో నగదు లభించకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురై అక్కడ ఉన్న క్రాకర్స్‌ను నిప్పు పెట్టాడు. అలా మొదలైన మంటలు పై అంతస్తులకు పాకాయి. బ్యాంక్ దగ్ధం కాగా.. కార్తికేయ లాడ్జీలో బస చేసిన వాళ్లు, సిబ్బందితో సహా మొత్తం 12 మంది చనిపోయారు. తాజాగా సోమవారం రాత్రి జరిగిన రూబీ లాడ్జి ఉదంతమూ ఈ కోవకు చెందినదే. దీని సెల్లార్లో ఉన్న ఎలక్ట్రికల్ బైక్ షోరూమ్‌లో అగ్గి రాజుకుంది. ఈ ధాటికి విడుదలైన మంటలు, పొగ.. పైన ఉన్న లాడ్జీలో బస చేసిన ఎనిమిది మంది ప్రాణాలను బలిగొన్నాయి. మరో 10 మంది క్షతగాత్రులుగా మారారు. (క్లిక్ చేయండి: చివరి నిమిషంలో రూబీ లాడ్జీలో దిగి.. మృత్యువు పిలిచినట్టు..) నగరంలో భారీ అగ్ని ప్రమాదాల్లో మరికొన్ని.. ► 21.10.2006: సోమాజిగూడలోని మీన జ్యువెలర్స్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇందులో పెయింటింగ్ పని చేయడానికి వచ్చిన వలస కార్మికులు పై అంతస్తులో నిద్రిస్తున్నారు. కింది ఫ్లోర్లో జరిగిన అగ్ని ప్రమాదంతో పెయింట్లు కాలి, విడుదలైన విష వాయువులతో ముగ్గురు చనిపోయారు. ► 24.11.2012: పుప్పాలగూడలోని బాబా నివాస్ అపార్ట్మెంట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం ఎనిమిది మంది చనిపోయారు. వాచ్‌మన్‌తో పాటు స్థానికుల అప్రమత్తత కారణంగా దాదాపు మరో పది మంది ప్రాణాలతో బయటపడ్డారు. ► 22.02.2017: అత్తాపూర్‌లోని పిల్లర్ నెం.253 సమీపంలో ఉన్న చిన్నతరహా పరిశ్రమలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కూలర్ల పరిశ్రమలో మంటలు చెలరేగి ఆరుగురు ఒడిశాకు కార్మికులు చనిపోయారు. ► 23.03.2022: న్యూ బోయగూడ వద్ద శ్రావణ్ ట్రేడర్స్ పేరుతో ఉన్న స్క్రాప్ గోదాంలో సంభవించిన అగ్నిప్రమాదంలో 11 మంది బిహార్ కార్మికులు మృత్యువాత పడ్డారు. (క్లిక్ చేయండి: సికింద్రాబాద్ అగ్నిప్రమాదం: నిప్పుల్లో నిబంధనలు) -
తమ్ముడి వేధింపులు: చున్నీతో హత్యచేసిన అన్నలు
జియాగూడ: కుటుంబ సభ్యులను వేధిస్తున్న వ్యక్తిని చున్నీతో హత్య చేసిన సంఘటన మంగళ్‌హాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. మంగళ్‌హాట్ ఇన్స్పెక్టర్ రణవీర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... అన్నదమ్ములైన రవీందర్, మహేందర్, ప్రసాద్ (21) తల్లితో కలిసి ఉంటున్నారు. ఇటీవల ప్రసాద్ తరచుగా డబ్బు విషయమై అన్నలతో, తల్లితో గొడవ పడుతుండటంతో రవీందర్ జీడిమెట్లకు మకాం మార్చాడు. అయినప్పటికీ ప్రసాద్ మద్యం సేవించి వచ్చి తరచుగా మరో అన్న మహేందర్, వదిన, తల్లితో గొడవ పడుతుండటంతో వారు కూడా ఇల్లు మారారు. ఇంట్లో ఒక్కడే ఉంటున్న ప్రసాద్ తన ప్రవర్తన మార్చుకోకుండా మహేందర్ వద్దకు వెళ్లి తల్లిని, అన్నను తరచుగా తిడుతుండడంతో మహేందర్ జీడిమెట్లలో ఉన్న రవీందర్‌కు ఫోన్‌చేసి మాట్లాడేందుకు రావాలని కోరాడు. ఆదివారం రాత్రి రవీందర్, మహేందర్ కలిసి ప్రసాద్ ఇంటికి వెళ్లగా మద్యం సేవించి ఉన్న ప్రసాద్ వారితో గొడవ పడ్డారు. దీంతో ఆవేశానికి గురైన రవీందర్, మహేందర్, ప్రసాద్ మెడను చున్నీతో ఉరి బిగించి హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రసాద్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి అనంతరం బంధువులకు అప్పగించారు. నిందితులపై కేసు నమోదు చేశారు. చదవండి: కరోనాతో గుడిమల్కాపూర్ కార్పొరేటర్ కుమార్తె మృతి -
యువకుడి హత్య: అక్క, బావ అరెస్టు
సాక్షి, జియాగూడ: కుల్సుంపురా పోలీసుస్టేషన్ పరిధిలో గత నెల 28న జరిగిన హత్య కేసును పోలీసులు చేధించారు. మద్యం తాగి తరచూ వేధిస్తుండటంతో అక్క, బావ కలిసి అతడిని కడతేర్చినట్టు తేల్చారు. ఇన్స్పెక్టర్ శంకర్, ఎస్ఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. జియాగూడ పుకట్‌నగర్‌కు చెందిన పెయింటర్ దినేష్‌సింగ్ (26), అతని సోదరుడు భరత్‌సింగ్ తిరుపతిలో పెయింటింగ్ పని చేసేవారు. వీరి అక్కాబావ నీతు, సూర్యప్రకాష్లు వెంకటేష్‌నగర్‌లో ఉంటున్నారు. ఇది లా ఉండగా లాక్డౌన్ నేపథ్యంలో నగరానికి వచ్చేసిన దినేశ్, భరత్‌సింగ్‌లు తరచూ మద్యం తాగి అక్క ఇంటికి వెళ్లి ఆమె వద్ద తాము దాచుకున్న డబ్బులు కోసం గొడవపడేవారు. ఎప్పటిలాగే గతనెల 28న రాత్రి ఇరువురూ మద్యం సేవించి అక్క ఇంటికి వెళ్లారు. తిరుపతి వెళ్లడానికి డబ్బులు కావాలని అడిగారు. సరేనన్న అక్క,బావలు రూ.100 ఇవ్వడంతో మళ్లీ మద్యం తాగారు. దినేశ్ అక్క ఇంట్లో పడుకోగా భరత్‌సింగ్ వెళ్లిపోయాడు. ఎప్పటినుంచో విసిగిపోయి ఉన్న అక్క, బావ కలిసి నిద్రపోతున్న దినేశ్ ముఖంపై దిండుతో గట్టిగా నొక్కి పెట్టి శ్వాస ఆడకుండా చేసి చంపేశారు. అర్ధరాత్రి ప్రాంతంలో ద్విచక్రవాహనంపై దినేశ్ మృతదేహాన్ని పురానాపూల్, ఇక్బాల్‌గంజ్ మీదుగా కల్లుకంపౌండ్ వద్దకు తీసుకెళ్లి దాని వెనుక భాగంలో పడేసి వెళ్లిపోయారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. రంగంలోకి దిగిన పోలీసులు హతు డు అక్కాబావలను అదుపులోకి తీసుకొని విచారించగా నేరం ఒప్పుకున్నారు. దీంతో నిందితులను ఆదివారం అరెస్టు చేశారు. సోమవారం రిమాండ్‌కు తరలిస్తామని పోలీసులు తెలిపారు. -
జియాగూడలో కొనసాగుతున్న ఇంటింటి సర్వే
అబిడ్స్/జియాగూడ: కరోనా మహమ్మారిని నివారించేందుకు జియాగూడ మున్సిపల్ డివిజన్లో అర్బన్ హెల్త్ ప్రైమరీ సెంటర్ వైద్యాధికారులు, ఆశ వర్కర్లు, పోలీసులు ముమ్మర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. జియాగూడ మున్సిపల్ డివిజన్లో వందకు పైగా కరోనా కేసులు నమోదు కావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కుల్సుంపురా పోలీస్‌స్టేషన్ పరిధిలోని జియాగూడ ప్రాంతాలైన ఇందిరానగర్, వెంకటేశ్వర్‌నగర్, దుర్గానగర్, సాయిదుర్గానగర్, మక్బరా, మేకలమండి, సబ్జిమండి, ఇక్బాల్‌గంజ్, సంజయ్‌నగర్ బస్తీల్లో కరోనా మహమ్మారి వేగంగా విస్తరించింది. ఈ వైరస్‌ను కట్టడి చేసేందుకు జియాగూడ నలుమూలలా గోషామహల్ ఏసీపీ నరేందర్‌రెడ్డి, జీహెచ్ఎంసీ అధికారులు కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశారు. దీంతో గత 10 రోజులుగా జియాగూడ పరిసర ప్రాంతాల్లో కరోనా తగ్గుముఖం పడుతోందని, కరోనాను నియంత్రించేందుకు కంటైన్మెంట్ ప్రాంతాలను కట్టడి చేయడంతో పాటు పలు హాట్స్పాట్లను కూడా అధికారులు ఏర్పాటు చేశారు. వైద్య ఆరోగ్యశాఖ అధ్వర్యంలో ఇంటింటి సర్వే... కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న బస్తీలతో పాటు కంటైన్మెంట్ జోన్లలో ప్రతిరోజు వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ ఎం.సుధా ఆధ్వర్యంలో ఆశవర్కర్లు, ఏఎన్ఎంలు ఇంటింటికి తిరుగుతూ ప్రజల వివరాలు సేకరిస్తున్నారు. ఎవరి ఇంట్లోనైనా కోవిడ్–19 లక్షణాలు ఉన్న వ్యక్తి ఉంటే వెంటనే అధికారులకు సంప్రదించాలని, అతడికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించి అంబులెన్స్‌లో గాంధీ ఆస్పత్రికి తరలించడం, లేక ఇంట్లోనే ఉంచి పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. కంటైన్మెంట్ జోన్లలో భారీ బందోబస్తు... జియాగూడలోని 10 కంటైన్మెంట్ జోన్లలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బస్తీలు, కాలనీలను కంటైన్మెంట్లు ఏర్పాటు చేయడంతో పోలీసులు ప్రజలను బయటికి రానివ్వడం లేదు. అత్యవసర పరిస్థితిలో తప్ప కాలనీవాసులు బయటికి రావొద్దని పోలీసులు సూచిస్తున్నారు. 24 గంటల పాటు కట్టుదిట్టమైన నిఘాను పెట్టి, జీహెచ్ఎంసీ అధికారుల సాయంతో ప్రతిరోజు నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారు. అధికారుల పర్యటన... కంటైన్మెంట్ జోన్లకు పలు శాఖల అధికారులు పర్యటించి స్థానిక ప్రజలకు మనోధైర్యాన్ని పెంచుతున్నారు. వైరస్‌ని నిర్మూలించడానికి డివిజన్ నలుమూలలా హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయిస్తున్నారు. ఇటీవల కుల్సుంపురా పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూ కరోనాతో కానిస్టేబుల్ మృతి చెందడంతో స్టేషన్‌కు నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ సందర్శించి ప్రజలకు, పోలీసులకు పలు జాగ్రత్తలతో కూడిన సూచనలు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకుని, బయటకు వచ్చేటప్పుడు మాస్క్, శానిటైజర్లు వాడాలని ఆయన తెలిపారు. సర్వేతో పాటు అవగాహన కల్పిస్తున్నాం కరోనా నివారణకు వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ఇంటింటికి సర్వే నిర్వహించి, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. జియాగూడలో వేలాది మందికి పరీక్షలు నిర్వహించాం. కోవిడ్–19 లక్షణాలు ఉన్న వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి వైద్యసేవలు అందిస్తున్నాం. కంటైన్మెంట్ జోన్లలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతోంది. పూర్తి స్థాయి నియంత్రణకు మరింత మ ందికి పరీక్షలు నిర్వహించడానికి ఆశవర్కర్లు, ఏఎన్ఎం సిబ్బంది సహకారంతో సర్వే చేపడుతున్నాం. మీ పరిసరాల్లో ఎవరికైనా జ్వరం, దగ్గు, జలుబు లాంటి లక్షణాలు కనిపిస్తే వైద్యసిబ్బందికి లేక అధికారులకు సంప్రదిస్తే వారికి పరీక్షలు నిర్వహించి ఆస్పత్రికి తరలిస్తాం. దీంతో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయగలం. డాక్టర్ ఎం.సుధా, డిప్యూటీ డీఎంహెచ్ఓ కంటైన్మెంట్ల ఏర్పాటుతో కరోనా కట్టడి జియాగూడలో కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేయడం ద్వారా కరోనా తగ్గుముఖం పట్టింది. జోన్ ప్రజలు పోలీస్ నిబంధనలు పాటించాలి. నిత్యావసరాలు కానీ, ఇతర వస్తువులు కావాలనుకున్నప్పుడు అధికారులకు సంప్రదిస్తే వాళ్లే మీ ఇంటికి వచ్చి సరుకులు అందజేస్తారు. అంతేకాకుండా జోన్లో నిబంధనలు తప్పక పాటించాలి. ప్రతిఒక్కరు భౌతిక దూరం పాటించడంతో పాటు ఇంట్లో ఉన్నప్పుడు శానిటైజేషన్, బయటకు వెళ్తే మాస్క్‌లు ధరించాలి. అధికారులకు, పోలీసులకు ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించి కరోనా నియంత్రణకు కృషి చేయాలి. నరేందర్‌రెడ్డి, గోషామహల్ ఏసీపీ -
పాల కోసం వెళుతున్న వ్యక్తిపై ఎస్ఐ కాఠిన్యం
జియాగూడ: కుమార్తెకు పాలు తీసుకువచ్చేందుకు వెళ్లిన వ్యక్తిని ఓ ఎస్ఐ చితకబాదిన ఘటన ఇందిరానగర్‌లోని కంటైన్మెంట్ జోన్ ప్రాంతంలో చోటుచేసుకుంది. బాధితుడి వివరాల ప్రకారం.. కంటైన్మెంట్ ప్రాంతంలో పోలీసులు బందోబస్తు నిర్వహించాల్సింది పోయి అదే బస్తీకి చెందిన రాజు అనే వ్యక్తికి బారికేడ్ తాళాలు అప్పగించారు. బుధవారం స్థానికంగా ఉంటున్న శేఖర్ తన కుమార్తె మాళవిక పాలు కావాలని ఏడుస్తుండగా తీసుకురావడానికి కంటైన్మెంట్ బారికేడ్ల వద్దకు వచ్చి.. తాళాలు తీయాలని రాజును కోరాడు. ఇందుకు రాజు ఒప్పుకోలేదు. దీంతో బారికేడ్లు దాటేందుకు శేఖర్ యత్నించగా అక్కడే ఉన్న మరో వ్యక్తి బయటకు వెళ్లవద్దని అడ్డుకున్నాడు. దీంతో అతడికి, శేఖర్‌కు మధ్య గొడవ జరిగింది. ఈ గొడవను రాజు తన సెల్ఫోన్లో వీడియో తీసి కుల్సుంపురా ఎస్ఐ అభిషేక్‌కు పంపించాడు. ఈ వీడియోను చూసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ శేఖర్‌ను లాఠీతో చితకబాదాడు. ఎస్ఐని అడ్డుకునేందుకు శేఖర్ భార్య, తల్లి ప్రయత్నించారు. ఈ ఘటనలో శేఖర్ భార్య చేతిలో ఉన్న రెండేళ్ల పాపకు సైతం లాఠీ దెబ్బలు తగిలాయి. ఈ విషయమై శేఖర్ కుల్సుంపురా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అంగీకరించలేదు. దీంతో గోషామహల్ ఏసీపీ నరేందర్‌రెడ్డి, వెస్ట్‌జోన్ డీసీపీ ఏఆర్.శ్రీనివాస్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోలీసు అధికారులు విచారణ చేపట్టారు. -
మరో ఆర్టీసీ కార్మికుడి ఆత్మహత్య
జియాగూడ: మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నగరంలోని రాణిగంజ్–2 డిపోకు చెందిన కండక్టర్ సురేందర్ గౌడ్ (45)ఆదివారం రాత్రి కార్వాన్‌లోని బాంజవాడి తోటలోని తన ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరూ లేని సమయంలో ప్లాస్టిక్ వైర్ తో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. గంట తర్వాత ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు ఆయన్ను హుటాహుటిన ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందారు. 14 ఏళ్లుగా ఆర్టీసీలో విధులు నిర్వహిస్తున్న సురేందర్.. ఇటీవల ఆందోళన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వస్తున్నారు. ఉద్యోగం పోతుందేమోనన్న ఆందోళనతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. సురేందర్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
జియాగూడలో 'డబుల్'కు భూమి పూజ
హైదరాబాద్: నగరంలోని జియాగూడలో నిర్మించనున్న 840 డబుల్ బెడ్ రూముల నిర్మాణాలకు మంత్రి కేటీఆర్ భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మేయర్ బొంతు రాంమోహన్, డిప్యూటీ సీయం మహమూద్ ఆలీ, నాయిని నర్సింహారెడ్డి, డిప్యూటి మేయర్ బాబా ఫసియుద్దిన్ తదితరులు హాజరయ్యారు. జియాగూడలో 12 బ్లాక్ లలో సిల్ట్ ప్లస్ ఫైవ్ నిర్మాణాలు చేపట్టనున్నారు. దీని ద్వారా 840 కుటుంబాలు లబ్ధిపొందనున్నాయి. ఒక్కో ఇంటి నిర్మాణానికి 8 లక్షల యాబై వేల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేయనుంది. పన్నెండు నెలల్లో నిర్మాణాలను జీహెచ్ఎంసీ పూర్తి చేయనుంది. -
మెహెందీ కోసం వెళ్లి...
జియాగూడ (హైదరాబాద్) : మెహెందీ కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువతి తిరిగి రాలేదు. కుల్సుంపురా పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... జియాగూడ ఇంద్రానగర్‌లో నివాసం ఉంటున్న రాణిభాయ్, దుర్గాసింగ్ల కుమార్తె మమ్మీ ఎలియాస్ జయా (26) మంగళవారం మధ్యాహ్నం మెహెందీ కోన్ తెచ్చుకుంటానంటూ బయటకువెళ్లింది. రాత్రయినా తిరిగి రాకపోవడంతో వారు చుట్టు పక్కల ప్రాంతాల్లో విచారించారు. ఫలితం లేకపోవడంతో పోలీస్ స్టేషన్లో బుధవారం ఫిర్యాదు చేశారు. -
జియాగూడలో భారీగా రేషన్ బియ్యం పట్టివేత
హైదరాబాద్ : నగరంలోని జియాగూడలో ఓ ఇంట్లో సౌత్ జోన్ పోలీసులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 290 బస్తాల రేషన్ బియ్యం పట్టుకున్నారు. వాటిని స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. అందుకు సంబంధించి నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.