కాళోజీ ఆశయాలు సాధిస్తాం: నాయిని | Minister Naini comments on Kaloji | Sakshi
Sakshi News home page

కాళోజీ ఆశయాలు సాధిస్తాం: నాయిని

Published Sun, Sep 10 2017 3:15 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM

కాళోజీ ఆశయాలు సాధిస్తాం: నాయిని - Sakshi

కాళోజీ ఆశయాలు సాధిస్తాం: నాయిని

- రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కాళోజీ జయంతి
డాక్టర్‌ సీతారాంకు కాళోజీ సాహితీ పురస్కార ప్రదానం
సాక్షి, హైదరాబాద్‌: ప్రజాకవి కాళోజీ నారాయణరావు ఆశయాలు, ఆలోచనలను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున శనివారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన కాళోజీ నారాయణరావు 103వ జయంతి ఉత్సవంలో మంత్రి నాయిని మాట్లా డారు. కాళోజీ అడుగడుగునా అన్యాయాన్ని ఎదిరించారని, ప్రభుత్వాల అవినీతిపై తిరుగు బాటు చేశారని ప్రశంసించారు. కాళోజీతో కలసి తొలి దశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం తన అదృష్టమని పేర్కొన్నారు. కాళోజీ మాటలే కవిత్వమని, ఆయన వ్యంగ్యంగా మాట్లాడితే కవిత్వం చదువుతున్నట్లుగా ఉండేదని గుర్తు చేసుకున్నారు. కాళోజీ వాదన, ఆలోచనలు, కవితలను స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని రాష్ట్ర శాసన మండలి చైర్మన్‌ కె.స్వామి గౌడ్‌ పేర్కొన్నారు.

కాళోజీ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో, ప్రతి పాఠశాలలో తెలంగాణ భాషా దినోత్సవాన్ని నిర్వహించాలని ప్రభుత్వానికి సూచించారు. ఎక్కడ అన్యాయం జరిగినా కాళోజీ నారాయణరావు ఎదిరించేవారని, అన్యాయాన్ని ఎదిరించినవాడే తన ఆరాధ్య దేవుడని కాళోజీ చెప్పుకున్నారని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ కొనియాడారు. హక్కులకు భంగం కలిగితే కాళోజీ ప్రశ్నించేవారని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ నందిని సిధారెడ్డి అన్నారు.

ఆ రోజుల్లో తెలంగాణ ఉద్యమానికి మద్దతిచ్చిన లబ్ధప్రతిష్టుడైన కవి కేవలం కాళోజీ ఒక్కరేనని గుర్తు చేశారు. భద్రాచలానికి చెందిన కవి, డాక్టర్‌ సీతారాంకు ఈ కార్యక్రమంలో కాళోజీ సాహితీ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్‌రావు, తెలుగువర్సిటీ వీసీ ఎస్వీ సత్యనారాయణ, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అయాచితం శ్రీధర్‌ తదితరులు ఇందులో పాల్గొన్నారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement