హైదరాబాద్ నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఆరుగురు వ్యక్తులు అదృశ్యమయ్యారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఆయా పోలీస్టేషన్ల పరిధిలో నమోదైన కేసుల వివరాలిలా ఉన్నాయి..
బొల్లారంలో యువతి...
బొల్లారం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ యువతి అదృశ్యమైంది. ఎస్‌ఐ సతీష్‌కుమార్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కొత్త బస్తీకి చెందిన లక్ష్మన్ కుమార్తె లావణ్య కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం సాయంత్రం బోనాల జాతరకు వెళ్లిందన్నారు. అయితే రాత్రి ఆమె ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు బంధువుల ఇళ్లల్లో గాలించినా ఫలితం కనిపించలేదు. దీంతో తండ్రి లక్ష్మన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
బీటెక్ విద్యార్థి...
ఘట్‌కేసర్: విద్యార్థి అదృశ్యమైన సంఘటన ఘట్‌కేసర్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సిద్దిపేట జిల్లాకు చెందిన ప్రశాంత్ అనురాగ్ విద్యాసంస్థలో బీటెక్ సంవత్సరం చదువుతున్నాడు. స్నేహితులతో కలిసి స్థానిక టీచర్స్ కాలనీలో ఉండేవాడు.సోమవారం అతని స్నేహితుడు ఆర్యన్ కుటుంబసభ్యులకు ఫోన్ చేసి సోమవారం తెల్లవారుజామునుంచి ప్రశాంత్ కనిపించడం లేదని సమాచారం అందించాడు. ప్రశాంత్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
రాజస్థాన్ యువకుడు..
చిలకలగూడ: దుఖాణంలో పని చేసేందుకు వచ్చిన రాజస్తాన్ యువకుడు అదృశ్యమైన ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్‌లో జరిగింది. రాజస్థాన్‌కు చెందిన మనోజ్ నార్ట్‌మల్ సువాషియా (18) ఈనెల 16న వారాసిగూడలోని రాందేవ్ ట్రేడర్స్‌లో పనిచేసేందుకు వచ్చాడు. 17న బయటికి వెళ్లిన అతను తిరిగి రాకపోవడంతో యజమాని ప్రకాష్‌చౌదరి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు మిస్సింగ్‌కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జైలు నుంచి విడుదలైన వ్యక్తి..
డబీర్‌పురా: జైలు విడుదలైన ఓ వ్యక్తి అదృశ్యమైన సంఘటన డబీర్‌పురా పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మహబూబ్‌నగర్ జిల్లా కర్వేన గ్రామానికి చెందిన మహేశ్ (30)ను బేగంపేట్ పోలీసులు కిడ్నాప్ కేసులో 2015లో అరెస్ట్ చేసి రిమాండ్‌కు చంచల్‌గూడ జైలుకు తరలించారు. గత నెల 9న చంచల్‌గూడ జైలు నుంచి విడుదలైన అతను ఇంటికి చేరుకోలేదు. కాగా ఈ నెల 13న కాయిన్ బాక్స్ నుంచి తండ్రికి ఫోన్ చేసి తాను ఇంటికి రావడం లేదని సమాచారం అందించాడు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు డబీర్‌పురా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆచూకీ తెలిసిన వారు 9912466555, 9490616525 నంబర్లకు సమాచారం అందించాలన్నారు.
ఇద్దరు యువతులు..
పంజగుట్ట: వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మహిళలు అదృశ్యమైన సంఘటన పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. బిఎస్ మక్తాకు చెందిన వివేక్ విద్యావర్థన్ భార్య సాయి మాధురి (23)తో కలిసి గత నెల 11న నగరానికి వచ్చాడు. ఈ నెల 17న భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది.మంగళవారం ఉదయం నిద్ర లేచేసరికి సాయి మాధురి కనిపించకపోవడంతో అతను పంజగుట్ట పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆచూకీ తెలిసిన వారు 9490616610 నెంబర్‌కు సమాచారం అందించాలని కోరారు.
లేడీస్ హాస్టల్ ఉద్యోగిణి.. .
అమీర్‌పేట శాంతినగర్ అపురూప లేడీస్ హాస్టల్‌లో స్వీపర్‌గా పని చేస్తున్న దొడ్ల బాలమణి (29) ఈ నెల 13న బయటికి వెళ్లి తిరిగి రాలేదు. బాలమణి సోదరి కాశమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఆచూకీ తెలియడం లేదు
Published Wed, Jul 19 2017 9:13 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement