‘బెంజీన్’ భూతం | Mobile pollution testing centres charging extra | Sakshi
Sakshi News home page

‘బెంజీన్’ భూతం

Published Mon, Jan 5 2015 2:22 AM | Last Updated on Fri, Sep 28 2018 3:27 PM

‘బెంజీన్’ భూతం - Sakshi

‘బెంజీన్’ భూతం

మోటారు వాహనాల కాలుష్యమే కారణం
పెట్రోలు, డీజిల్ కల్తీతో అనర్థం
గాలిలో పెరుగుతున్న బెంజీన్ మోతాదు
క్యాన్సర్, రక్తహీనత, గుండెపోటుకు కారణం

సాక్షి, సిటీబ్యూరో: మహా నగరం ‘బెంజీన్’ భూతం కోరల్లో చిక్కుకుంటోంది. చాపకింద నీరులా విస్తరిస్తున్న ఈ భూతం మన ఆరోగ్యాన్ని హరి స్తోంది. ఇప్పటికే దీని కోరల్లో ఎంతోమంది చి క్కుకొని విలవిల్లాడుతున్నారు. క్యాన్సర్, గుండెపోటు, రక్తహీనతకు కారణమయ్యే బెంజీన్ మూలకం మోతాదు వాతావరణంలో రోజురోజుకూ పెరుగుతూనే ఉంది.

క్యూబిక్ మీటరు గాలిలో ఇది 5 మైక్రోగ్రాములు దాటకూడదు. కానీ అనూహ్యంగా గ్రేటర్‌లో 8.4 మైక్రోగ్రాములకు చేరడం ఆందోళన కలిగిస్తోంది.మహానగరంలో వాహనాల సంఖ్య 45 లక్షలకు చేరుకోవడం... ఇందులో పదేళ్లకు మించిన కాలం చెల్లిన వాహనాలు సుమారు 15 లక్షల మేర ఉండడంతో నగరం పొగ చూరుతోంది. మరోవైపు కల్తీ ఇంధనాల వాడకం పెరగడం, పెట్రోలు, డీజీలు వంటి పెట్రో ఉత్పత్తులను విచక్షణారహితంగా వినియోగిస్తుండడంతో బెంజీన్ భూతం జడలు విప్పిందని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
దీర్ఘకాల సమస్యే
తీయటి వాసన గల బెంజీన్ మూలకం మోతాదు అవధులు దాటితే అనర్థమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి మండే స్వభావమూ అధికమేనని తెలిపారు. ఇది అతి త్వరగా ఆవిరవుతుంది. ఈ మూలకం విచ్ఛిన్నమయ్యేందుకు 10 నుంచి 30 ఏళ్లు పడుతుందని అంటున్నారు. అంటే వాతావరణంలో సుదీర్ఘకాలం దీని ప్రభావం ఉంటుందన్నమాట. ఇది గాలి ద్వారా ఒక చోటు నుంచి మరొక చోటుకు తరలి వెళుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని ప్రభావం అధికంగా ఉన్న చోట క్యాన్సర్, రక్తహీనత, టీబీ వ్యాధులు ప్రబలుతాయని పీసీబీ శాస్త్రవేత్త వీరన్న ‘సాక్షి’కి తెలిపారు.
 
మెట్రో నగరాల్లో ఇలా...
క్యూబిక్ మీటరు గాలిలో బెంజీన్ మోతాదు 5 మైక్రోగ్రాములు మించరాదని కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ప్రమాణాలు స్పష్టం చేస్తున్నాయి. కానీ దేశ రాజధాని ఢిల్లీలో ఏడాదికి సరాసరి 16 మైక్రోగ్రాములు, ముంబ యిలో 18 మైక్రోగ్రాములు, బెంగళూరులో 7 మైక్రోగ్రాములుగా నమోదైంది. చెన్నైలో 8 మైక్రోగ్రాములు, కోల్‌కతాలో 15 మైక్రోగ్రాములుగా ఉంది. దేశంలో అత్యధికంగా కాన్పూర్ నగరంలో ఏకంగా 22 మైక్రోగ్రాములుగా బెంజీన్ మోతాదు నమోదవడం గమనార్హం. ఇక మన నగరంలో ప్రస్తుతం 8.4గా ఉన్న బెంజీన్ మోతాదు సమీప భవిష్యత్తులో మరింత పెరిగే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
 
వాహన కాలుష్యంతోనే అనర్థం
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రస్తుతం అన్నిరకాల వాహనాలు (ద్విచక్ర వాహనాలు, కార్లు, జీపులు, ఆటోలు) కలిపి 45 లక్షలు ఉన్నాయి. ఇందులో పదేళ్లకు పైబడిన వాహనాలు 15 లక్షల వరకు ఉన్నాయి. ఈ వాహనాల సామర్థ్యం దెబ్బతినడంతో లెక్కకు మిక్కిలి పొగ వెలువడుతోంది.

నగరంలో ఏటా 58.40 కోట్ల లీటర్ల పెట్రోలు, 102 కోట్ల లీటర్ల డీజిల్ వినియోగిస్తున్నారు. పైగా ఏటా 1.75 లక్షల నుంచి 2 లక్షల వాహనాలు కొత్తగా వచ్చి చేరుతున్నాయి. నిత్యం 600 కొత్త వాహనాలు రిజిష్టర్ అవుతున్నట్లు రవాణా అధికారుల అంచనా. మహా నగరంలో రహదారులు 8 శాతం మేరఅందుబాటులో ఉండడంతో ట్రాఫిక్ రద్దీ పెరిగి ఇంధన వినియోగం అధికమవుతోంది.

కాలుష్యం అంతకంతకు పెరుగుతోంది. ఈ వాయు కాలుష్యంలో బెంజీన్ మోతాదు కూడా ఏటా పెరుగుతూనే ఉంది. 2015 నాటికి  వాహనాల సంఖ్య సుమారు 50 లక్షలకు చేరుకోనున్నట్లు రవాణా శాఖ అంచనా వేస్తోంది. చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, వంటి నగరాలతో పోల్చుకుంటే ప్రస్తుతానికి నగరంలో వాహనాల సంఖ్య తక్కువగానే ఉంది. వాహన సాంద్రత మాత్రం ఎక్కువగా ఉంది.
 
పరిశ్రమలు సైతం..
ప్లాస్టిక్, రసాయన, డిటర్జెంట్, క్రిమి సంహారకాలు, రబ్బరు, బల్క్‌డ్రగ్ పరిశ్రమల నుంచి వెలువడే వాయువుల్లో బెంజీన్ మోతాదు ఉన్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. కాలుష్య నియంత్రణ మండలి కళ్లుగప్పి పారిశ్రామికవర్గాలు విడుదల చేస్తున్న వాయువుల్లో బెంజీన్ ఉన్నట్లు వారు నిర్ధారించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement