హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో పనికిరాని ప్రభుత్వం ఉందంటూ టీఆర్ఎస్పై బీజేపీ నాయకుడు నాగం జనార్ధన్రెడ్డి శుక్రవారం హైదరాబాద్లో మండిపడ్డారు. తెలంగాణ ప్రజల శాపం ఈ ప్రభుత్వానికి తగులుతుందన్నారు. రాష్ట్రంలో కరువు మండలాలు కూడా ఇప్పటి వరకు ప్రకటించనీ మూర్ఖపు ప్రభుత్వం టీఆర్ఎస్ అని నిప్పులు చెరిగారు.
ప్రాజెక్ట్ల రీ డిజైన్ ఎవరికోసం అని ప్రశ్నించారు. అవినీతి విషయంలో టి.రాజయ్యకో న్యాయం.. మీ కుటుంబానికో న్యాయమా? అని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ను సూటిగా నిలదీశారు. తలసాని రాజీనామా ఆమోదానికి ఇంత సమయం ఎందుకు తీసుకున్నారో చెప్పాలని టీఆర్ఎస్ను నిలదీశారు.