సాక్షి, హైదరాబాద్: నగరంలోని కూకట్‌పల్లిలో ఉన్న నారాయణ జూనియర్ కాలేజిలో మంగళవారం దారుణం చోటు చేసుకుంది. కాలేజి హాస్టల్‌లో ఉంటూ ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఉరేసుకున్న సంఘటన స్థానికంగా కలకలం రేపింది. నాగసాయి అనే విద్యార్థి ప్రగతి నగర్‌లోని నారాయణ కాలేజి బ్రాంచ్‌లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.
మంగళవారం గదిలోకి వెళ్లిన సాయి.. ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే, విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడానికి దారితీసిన పరిస్థితులు, కారణాలు ఇంకా తెలియరాలేదు. విద్యాసంస్థల ఒత్తిడిని తట్టుకోలేక విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే.