
ఎల్లమ్మగుడికి నీతా అంబానీ
హైదరాబాద్: రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ హైదరాబాద్ బల్కంపేటలోని ఎల్లమ్మగుడిని సోమవారం రాత్రి దర్శించారు. ఐపీఎల్‌లో భాగంగా సిటీకి వచ్చిన ముంబై ఇండియన్స్ టీమ్ యజమానురాలు నీతా అంబానీకి ఆలయ ఈవో ఎంవీ శర్మ స్వాగతం పలికారు. వేదపండితులు వేణుగోపాలచారి, యోగానందచార్యులు గర్భగుడిలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి శేష వస్త్రాలు, తీర్థప్రసాదాలను ఆమెకు అందజేశారు.