
హైదరాబాద్: గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో నిమజ్జనం రోజున మండపాల వద్ద వేలం పాటలు సాధారణం. ఓ బస్తీలో మాత్రం లడ్డూ వేలం తరహాలోనే అధ్యక్ష పదవిని బహిరంగ వేలం వేశారు. ఘటన జూబ్లీహిల్స్ డివిజన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. ఫిలింనగర్ వినాయకనగర్ బస్తీలో బస్తీ సంక్షేమ సంఘం అధ్యక్ష పదవి ఖాళీగా ఉంది.
ఎన్నికలు, ప్రచారం ఇదంతా ఎందుకని వేలం పాటలో ఎక్కువ సొమ్ము చెల్లించిన వారికి అధ్యక్ష పదవి ఇవ్వాలని బస్తీవాసులు తీర్మానించారు. వేలంలో హెచ్.బాబురావు అనే స్థానికుడు రూ.4.05 లక్షలకు అధ్యక్ష పదవిని సొంతం చేసుకున్నారు. అనంతరం బస్తీ కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు.