Public auction
-
'మాన్సాస్' కౌలు కిరికిరి
తగరపువలస (విశాఖ): అవి ఏడెనిమిది తరాల నుంచి సాగు చేసుకుంటున్న భూములు.. వాటికి పద్దెనిమిది సంవత్సరాలకు పైగా ఏనాడూ కౌలు వసూలు చేయలేదు.. ఇప్పుడు ఉన్న పళంగా ఎవరికీ చెప్పాపెట్టకుండా గ్రామసభ పెట్టి కౌలు వేలం నిర్వహిస్తామని ఏకపక్షంగా ప్రకటించేశారు. పైగా గతంలో వన్‌టైమ్ సెటిల్మెంట్కు వచ్చి ఇప్పుడు ఆ మాట మార్చేశారు. దీంతో ఆ భూములు సాగుచేసుకుంటున్న రైతులు మండిపడుతున్నారు. ఈ కలవరపాటుకు కారణం విశాఖ జిల్లాలో ‘మాన్సాస్’ ట్రస్ట్ తాజా వ్యవహారం. విషయం ఏమిటంటే.. ఆనందపురం మండలం బోని పంచాయతీలో మాన్సాస్ ట్రస్ట్‌కు 614.97 ఎకరాల భూములున్నాయి. వీటికి సంబంధించి మూడేళ్ల కాలపరిమితితో జూలై ఒకటి నుంచి మూడో తేదీ వరకు లైసెన్సు హక్కులు నిర్ణయించనున్నారు. బహిరంగ వేలం ద్వారా నిర్ణయించనున్న ఈ ట్రస్ట్ భూములకు సంబంధించి మాన్సాస్ ప్రతినిధులు, ఆనందపురం రెవెన్యూ అధికారులు బోని పంచాయతీ కార్యాలయం వద్ద మంగళవారం గ్రామసభ నిర్వహించారు. మాన్సాస్ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థల అభివృద్ధికి గాను ఈ కౌలు ద్వారా వచ్చే ఆదాయాన్ని కేటాయిస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు రైతులకు తెలిపారు. కొన్నాళ్లుగా రైతులెవరూ కౌలు చెల్లించకపోవడంతో మాన్సాస్ లక్ష్యం దెబ్బతింటోందని దీనికి కౌలు రైతులంతా సహకరించకపోతే తాము మరోదారిలో వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు.మాన్సాస్ భూములు కేవలం కౌలుకు మాత్రమేనని విక్రయానికి సాధ్యపడదని రైతులకు తెలిపారు. ఎవరైనా వన్‌టైమ్ సెటిల్మెంట్ పేరుతో వచ్చినా నమ్మవద్దని తెలిపారు. వ్యవసాయానికి అయితే ఏడాదికి ఎకరాకు రూ.5వేలు.. ఇటుక బట్టీలకైతే ఇంకా ఎక్కువ ధర నిర్ణయించనున్నట్లు మాన్సాస్ ప్రతినిధులు తెలిపారు. సాగు హక్కులు కావాలంటూ రైతుల పట్టు.. పద్మనాభం మండలం కృష్ణాపురంలో ఇనాం రైతులకు ఇచ్చినట్లే తమకు కూడా మాన్సాస్ సాగు హక్కులు ఇవ్వాలంటూ కౌలు రైతులు పట్టుబట్టారు. గతంలో మాన్సాస్ ప్రతినిధులు రైతులతో వన్‌టైమ్ సెటిల్మెంట్కు వచ్చినట్లు గుర్తుచేశారు. అసలు ఇక్కడి భూముల్లో బంజరు, ఇనాం, మాన్సాస్‌లకు చెందినవి విడివిడిగా చూపించాలన్నారు. స్వాతంత్రానికి పూర్వం నుంచి తమ ఏడెనిమిది తరాల వారు ఈ భూములను సాగు చేసుకుంటున్నట్లు వారంతా గుర్తుచేశారు. నిజానికి.. 18 ఏళ్లకు పైగా మాన్సాస్ ట్రస్ట్ తమ నుంచి కౌలు వసూలు చేయడంలేదని.. అంతకుముందు ఏడాదిలో ఎకరాకు రూ.20 నుంచి రూ.50 కౌలు మించేది కాదన్నారు. ఆరి్థకంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన తమపై కౌలు పేరుతో చెల్లించలేనంత భారాన్ని మోపితే సహించబోమన్నారు. దీంతో గ్రామసభ మరోమారు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఇప్పుడు కౌలు అడగడం సరికాదు.. ముగ్గురు ఆడపిల్లలు, భార్య, నేను కలిసి ఎకరా భూమి సాగుచేసుకుంటున్నాం. మాకు తాతముత్తాతల నుంచి ఈ భూమే ఆధారం. ఇప్పుడొచ్చి ఏడాదికి రూ.5 వేలు కౌలు చెల్లించాలని ఒత్తిడి తీసుకురావడం సరిగాలేదు. – కాళ్ల నారాయణ, కౌలు రైతు, బోని గ్రామం ముందస్తు సమాచారమే లేదు.. ముందుగా సర్పంచ్, ఎంపీటీసీలకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. కనీసం పత్రికల్లో ప్రకటన కూడా ఇవ్వలేదు. వాళ్లంతట వాళ్లే కరపత్రాలు ఈరోజు పట్టుకొచ్చి గ్రామసభలో పంచిపెట్టారు. కౌలు రైతులు ఎవరూ ఇందుకు సిద్ధంగా లేరు. – బోని ముకుంద, కౌలు రైతు, బోని గ్రామం కౌలు భూములకు కమర్షియల్ ధరలా? మేం సాగు చేసుకుంటున్న భూములపై సాగు హక్కులు కల్పించాలి. అప్పుడే మా కుటుంబాలకు భద్రత. కౌలు భూములకు కమర్షియల్ ధరలంటూ రైతులను అయోమయానికి గురిచేస్తున్నారు. – సూరకత్తుల వెంకట్రావు, కౌలు రైతు, బోని గ్రామం రైతులను వేధిస్తే ఊరుకోం.. 1971లో గరీబ్ హఠవో ద్వారా ఇందిరాగాంధీ.. 1986లో దున్నేవాడిదే భూమిపై హక్కులు అంటూ ఎన్టీఆర్.. 30 ఏళ్లు సాగులో ఉండేవారికి భూమిపై అన్ని హక్కులు సంక్రమిస్తాయని చెప్పారు. 1956లో ట్రస్ట్లన్నింటినీ ప్రభుత్వం రద్దుచేసింది. 1958లో పుట్టుకొచ్చిన మాన్సాస్‌పై చాలా కేసులున్నాయి. చాలా ఏళ్ల తరువాత వచ్చి ఇప్పుడు కౌలు కట్టాలని రైతులను వేధిస్తే ఊరుకోం. – బోని సోంబాబు, కౌలు రైతు, బోని గ్రామం వన్‌టైం సెటిల్మెంట్పై మాటమార్చారు.. మా బోని గ్రామ పంచాయతీ ప్రజలంతా అన్ని విధాలుగా వెనుకబడి ఉన్నాం. ప్రభుత్వాలు కల్పిస్తున్న వసతులతో కౌలు భూములు సాగుచేసుకుంటున్నాం. గతంలో మాన్సాస్ ప్రతినిధులు వన్ టైమ్ సెటిల్మెంట్కు వచ్చారు. ఇప్పుడు కాదంటున్నారు. – మద్దిల తాతినాయుడు, కౌలు రైతు, బోని గ్రామం -
AP High Court: వేలంలో కొన్న అసైన్డ్ భూమి నిషేధిత జాబితాలోకి రాదు
సాక్షి, అమరావతి: బహిరంగ వేలంలో కొన్న అసైన్డ్ భూమిని నిషేధిత భూముల జాబితా (22ఏ)లో చేర్చడం చట్టవిరుద్ధమని హైకోర్టు స్పష్టం చేసింది. అసైన్డ్ భూమిని ఎవరైనా బహిరంగ వేలం ద్వారా కొనుగోలు చేసినప్పుడు దాన్ని అసైన్డ్ భూమిగా పరిగణించడానికి వీల్లేదంది. ఈ మేరకు చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం కొట్రమంగళంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నిర్వహించిన బహిరంగ వేలంలో కొనుగోలు చేసిన 10 ఎకరాల భూమిని నిషేధిత భూముల జాబితాలో చేరుస్తూ రెవెన్యూ శాఖ జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు చట్టవిరుద్ధంగా ప్రకటించింది. ఆ ఉత్తర్వులకు అనుగుణంగా సీసీఎల్ఏ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను రద్దు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ఇటీవల తీర్పు ఇచ్చారు. నిషేధిత భూముల జాబితాలో చేర్చడం సరికాదు.. బహిరంగ వేలం ద్వారా కొనుగోలు చేసిన అసైన్డ్ భూమిని నిషేధిత భూముల జాబితాలో చేరుస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ పి.గీత, ఇ.మోహన్ రామిరెడ్డి, ఎం.విజయభాస్కరరాజు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణమూర్తి విచారణ జరిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ‘పిటిషనర్లు వ్యవసాయ సహకార సంఘం నిర్వహించిన బహిరంగ వేలంలో భూములు కొన్నారు. రెవెన్యూ రికార్డుల్లో కూడా వారి పేర్లు నమోదయ్యాయి. పాసు పుస్తకాలు కూడా జారీ అయ్యాయి. తుడా అధికారులు కూడా ఎన్వోసీ ఇచ్చారు. ఇన్ని జరిగినప్పటికీ ప్రభుత్వం పిటిషనర్ల భూములను నిషేధిత భూముల జాబితాలో చేర్చింది’ అని ఆక్షేపించారు. అంతేకాకుండా ‘భూమిని అసైన్డ్‌దారుకి కేటాయించినప్పుడు ఆ భూమికి ప్రభుత్వం యజమాని కాదు. ఆ భూమికి అన్ని రకాలుగా అసైన్డ్‌దారే యజమాని. భూమిని తాకట్టుపెట్టి అసైన్డ్‌దారు రుణం తీసుకోవచ్చు. తీసుకున్న రుణాన్ని అసైన్డ్‌దారు చెల్లించలేకపోతే ఆ భూమిని వేలం వేయొచ్చు. వేలంలో ఆ భూమిని ఎవరైనా కొనుగోలు చేస్తే అప్పటి నుంచి ఆ భూమిని అసైన్డ్ భూమిగా పరిగణించరాదు’ అని తీర్పులో పేర్కొన్నారు. -
4 లక్షలు.. ఒకటోసారి..
హైదరాబాద్: గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో నిమజ్జనం రోజున మండపాల వద్ద వేలం పాటలు సాధారణం. ఓ బస్తీలో మాత్రం లడ్డూ వేలం తరహాలోనే అధ్యక్ష పదవిని బహిరంగ వేలం వేశారు. ఘటన జూబ్లీహిల్స్ డివిజన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. ఫిలింనగర్ వినాయకనగర్ బస్తీలో బస్తీ సంక్షేమ సంఘం అధ్యక్ష పదవి ఖాళీగా ఉంది. ఎన్నికలు, ప్రచారం ఇదంతా ఎందుకని వేలం పాటలో ఎక్కువ సొమ్ము చెల్లించిన వారికి అధ్యక్ష పదవి ఇవ్వాలని బస్తీవాసులు తీర్మానించారు. వేలంలో హెచ్.బాబురావు అనే స్థానికుడు రూ.4.05 లక్షలకు అధ్యక్ష పదవిని సొంతం చేసుకున్నారు. అనంతరం బస్తీ కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. -
మళ్లీ గలీజుదందా!
మున్సిపల్ దుకాణాల బహిరంగ వేలంలో కొత్త ట్విస్ట్ * 100 శాతం పెంచి పాత వారికే ఇస్తారంటా.. * పోతూ.. పోతూ పాత కమిషనర్ నిర్ణయం * 30 ఏళ్లు వారికే ఇవ్వాలని జీఓ వచ్చిందంట కోదాడటౌన్ : కోదాడ పురపాలక సంఘానికి చెందిన దుకాణాల సముదాయ బహిరంగ వేలం విషయంలో పాలకులు, అధికారులు పట్టణ ప్రజలకు కొత్త ట్విస్ట్ ఇచ్చారు. ఇప్పటి వరకు వేలం వేస్తాం అదిగో.. ఇదిగో అంటూ చెప్పిన అధికారులు తెరవెనుక వేరే రాజకీయం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పాత కమిషనర్ ఇక్కడి నుంచి బదిలీపై వెళ్లడానికి ముందు దుకాణాల లీజు దారుల నుండి 100 శాతం అద్దెలు పెంచి ఏప్రిల్ 1 నుండి వసూలు చేయాలని ఆదేశించినట్లు విశ్వసనీయ సమాచారం. కౌన్సిలర్లు మొదలుకొని అధికారుల వరకు కుమ్మక్కై అడుగడుగునా బహిరంగ వేలానికి మొకాలడ్డుతూ లీజుదారుల కొమ్ముకాస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తెరపైకి కొత్త విషయం మున్సిపల్ దుకాణాల వేలం విషయంలో తాజాగా వెలుగులోకి వస్తున్న సమాచారం ప్రకారం కొందరు లీజు దారులు కొత్త విషయాన్ని తెరపైకి తెస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం కొత్త జీఓ తెచ్చిందని దాని ప్రకారం ఒక సారి లీజు దక్కించుకున్న వారు 30 ఏళ్ల వరకు దానిపై హక్కులు ఉంటాయని చెబుతున్నారు. వాస్తవానికి ప్రతి రెండు లేదా మూడేళ్లకు ఒకసారి వేలం వేసి దుకాణాలను కేటాయించాల్సి ఉండగా మరీ 30 సంవత్సరాల మాటేమిటో విషయం అర్థం కావడం లేదని పలువురు విపక్ష కౌన్సిలర్లు అంటున్నారు. అసలు ఆ జీఓ ఎపుడు వచ్చింది? దాని అర్థం ఏమిటి? ఎవరికి వర్తిస్తుంది? అసలు అది అసలు జీఓనేనా? ముందు తేల్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా జనవరిలో జరిగిన పాలకవర్గ సమావేశంలో పాతవారికే ఇపుడు ఉన్న అద్దెలపై 100 శాతం పెంచి దుకాణాలను కేటాయించాలని తీర్మానం చేసినట్లు అధికారులు చెబుతున్నారు. విపక్ష కౌన్సిలర్లు మాత్రం ఈ విషయం అసలు మాకు తెలియదని, దీనిపై తమకు పూర్తి వివరాలను ఇవ్వాలని వారం క్రితం జరిగిన సమావేశంలో ప్లోర్‌లీడర్ దండా వీరభద్రం కోరారు. గుడ్‌విల్ తీసుకొని ఇతరులకు.. దుకాణాల వేలం విషయం పక్కన పెడి తే దీనిలో వ్యాపారులు అనేక ఉల్లంఘనలకు పా ల్పడ్డట్లు తెలుస్తోంది. గతం లో లీజుకు తీసుకున్న వారిలో సగానికి పైగా వ్యాపారులు ఈ దుకాణాలను లక్షల రూపాయల గుడ్‌విల్ కింద ఇతరులకు అమ్ముకున్నారు. వాస్తవానికి లీజుదారుడు ఇతరులకు దుకాణాన్ని ఇస్తే వెంటనే లీజు ర ద్దువుతుంది. దీన్ని లీజు అగ్రిమెంట్లో ప్ర ముఖంగా పేర్కొంటారు. అంతే కాకుండా ఎటువంటి మార్పులు, చేర్పులు చేయకూడదు. కానీ, పలువురు వ్యాపారులు తమ దుకాణాలను రెండుగా విభజించి ఇతరులకు అద్దెకు ఇచ్చారు. కొందరు రెండు షాప్‌లను కలిపి ఒకటి చేశారు. ఈ మార్పులను దొడ్డిదారిని రికార్డుల్లో కూడా నమోదు చేయించారంటే ఈ వ్యవహారంలో సిబ్బంది చేతివాటం ఎంతుందో అర్థం చేసుకోవచ్చు. లీజు అగ్రిమెంట్ కాగితాలు ఒక్కసారి బయటకు తీస్తే ఆ వ్యవహారం బయటపడే అవకాశం ఉన్నా దీని గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. కారణం ఇదంతా బహిరంగ రహస్యమే కాబట్టి. 100 శాతం పెంచినా తక్కువే.. దుకాణాల వేలం జరగకుండా అడ్డుకోవడానికి లీజుదారులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేయడం వెనక అనేక కారణాలే ఉన్నాయి. ఈ దుకాణాల అద్దెల్లో ఉన్న తేడాతో పాటు షాప్‌లు పట్టణ నడిబొడ్డున ఉండడం, ఈ ప్రాంతంలో నిత్యం రద్దీ ఉండడం కారణమని తెలుస్తోంది. ఇక్కడ ఒక్కో షాప్ అద్దె రూ.20 నుంచి రూ.25 వేల వరకు ఉన్నది. కానీ, మున్సిపల్ దుకాణాల అద్దె మాత్రం కేవలం రూ.3 నుంచి రూ.5 వేల వరకు మాత్రమే చెల్లిస్తున్నారు. ఈ లెక్కన తాజాగా అద్దెలను 100 శాతం పెంచినా అది రూ.5 నుంచి రూ.6వేలు కూడా దాటదు. అంతే కాదు లక్షల రూపాయలు అడ్వాన్సగా చెల్లించినా షాప్ అద్దెకు దొరకడం కష్టమే. పాత కమిషనరే నిర్ణయం తీసుకున్నారు కమినర్‌గా బాలోజీనాయక్ ఉన్న సమయంలోనే సాయికృష్ణ థియేటర్ రోడ్డులో ఉన్న దుకాణాల అద్దెపై 100 శాతం పెంచి ఏప్రిల్-2016 నుంచి వసూళ్లు చేయాలని ఆదేశించారు. జనవరి నెలలో జరిగిన పాలకవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కొత్త కమిషనర్ వచ్చారు. ఈ విషయాన్ని మరోసారి ఆయన దృష్టికి తీసుకెళ్లి వారి నిర్ణయం ప్రకారం నడుచుకుంటాం. - బుచ్చిబాబు, మున్సిపల్ మేనేజర్