
నీళ్లు లేక ఆగిన ఆపరేషన్లు
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు ఏ చిన్న సమస్య వచ్చినా అందరికీ ముందుగా గుర్తొచ్చేది గాంధీ ఆస్పత్రే.. ఇక్కడ ప్రతిరోజూ దాదాపు 50 మేజర్ ఆపరేషన్లు, 100కు పైగా మైనర్ ఆపరేషన్లు జరుగుతూ ఉంటాయి. అలాంటి గాంధీ ఆస్పత్రిలో శుక్రవారం ఉదయం నుంచి ఒక్క ఆపరేషన్ కూడా జరగలేదు.
వివరాల్లోకి వెళ్తే.. ఉదయం నుంచి ఆపరేషన్ థియేటర్‌లకు నీటి సరఫరా నిలిచిపోవడంతో ఈ సమస్య నెలకొంది. ఆపరేషన్ థియేటర్‌లకు నీళ్లు సరఫరా చేసే పంపులకు విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో అత్యవసర చికిత్సలన్నీ నిలిచిపోయాయి. ప్రస్తుతం మరమ్మతులు కొనసాగుతున్నాయి.