జాతీయ స్థాయిలో ఏడు పీఎస్పీ పురస్కారాలు
సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా రాష్ట్రానికి పలు అవార్డులు లభించాయి. ఆదివారం జార్ఖండ్‌లోని జెంషెడ్‌పూర్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రాష్ట్రానికి చెందిన పలువురు సర్పంచులు, ఎంపీపీలు, జడ్పీ చైర్మన్లు ఈ పురస్కారాలను అందుకున్నారు. జాతీయ స్థాయిలో వరంగల్ జిల్లా పరిషత్‌కు, సిద్దిపేట, తలకొండపల్లి మండల పరిషత్‌లకు, సిరిసిల్ల మండలం బాలమల్లుపల్లి, చందుర్తి మండలం రామన్నపేట, సిద్దిపేట మండలంలోని ఇబ్రహీంపూర్, లింగారెడ్డిపల్లిలకు పంచాయతీ సశక్తి కరణ్ పురస్కారాలు లభించాయి.
కరీంనగర్ జిల్లా చందుర్తి గ్రామ పంచాయతీకి రాష్ట్రీయ గౌరవ్ గ్రామసభ అవార్డు కింద రూ.10 లక్షల నగదు బహుమతి లభించింది. జెంషెడ్‌పూర్‌లో జరిగిన పంచాయతీరాజ్ దివస్‌లో రాష్ట్రం నుంచి పీఆర్‌అండ్‌ఆర్‌డీ డెరైక్టర్ అనితారామ్ చంద్రన్, డిప్యూటీ కమిషనర్ రామారావు, అసిస్టెంట్ కమిషనర్ సుబ్రమణ్యం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్‌ల చైర్మన్లు, 24 మంది మండలపరిషత్‌ల అధ్యక్షులు, 34 మంది గ్రామ పంచాయతీల సర్పంచులు పాల్గొన్నారు.
రాష్ట్రానికి ‘పంచాయతీరాజ్’ అవార్డులు
Published Tue, Apr 26 2016 1:03 AM | Last Updated on Wed, Aug 15 2018 6:34 PM
Advertisement
Advertisement