ట్రూ జెట్ ఫ్లయిట్ రద్దు, ప్రయాణికుల ఆందోళన
హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయం నుంచి తిరుపతి వెళ్లాల్సిన ట్రూ జెట్ విమానం రద్దు అయింది. దీంతో మంగళవారం ఉదయం 70 మంది ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ముందస్తు సమాచారం లేకుండా విమానాన్ని ఎలా రద్దు చేస్తారంటూ ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే విమానా సిబ్బంది మాత్రం ప్రయాణికుల ఆందోళనను ఏమాత్రం పట్టించుకోలేదని తెలుస్తోంది. కాగా సాంకేతిక లోపం కారణంగానే ట్రూ జెట్ ఫ్లయిట్ రద్దు అయినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలయాల్సి ఉంది.