హైదరాబాద్: పదో పీఆర్‌సీ నివేదికను 70 శాతం ఫిట్‌మెంట్ బెనిఫిట్‌తో రూపొందించి ఈ నెల 30వ తేదీలోగా ప్రభుత్వానికి అందజేయాలని తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం(టీఎన్‌జీవోస్) నేతలు విజ్ఞప్తి చేశారు. టీఎన్‌జీవోస్ అధ్యక్షుడు దేవీప్రసాద్ నే తృత్వంలో నేతలు రవీందర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, శ్రవణ్‌కుమార్‌రెడ్డి, వేణుమాధవ్ , చారి, తదితరులు బుధవారం సచివాలయంలో ఈ మేరకు పీఆర్‌సీ కమిషనర్ అగర్వాల్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు.
పీఆర్‌సీ గడువును ప్రభుత్వం మే 31వ తేదీ వరకు పొడిగించిన నేపథ్యంలో పీఆర్‌సీ నివేదికను త్వరగా అందజేయాలని వారు కోరారు. వివిధ శాఖలు కోరిన విధంగా వేతనాలను నిర్ధారించాలని విన్నవించారు. అనామలీస్ కమిటీ ఏర్పాటుకు అవకాశం లేకుండా నివేదికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించాలని కోరారు.
30లోగా పీఆర్‌సీ నివేదికను అందజేయండి: టీఎన్‌జీవోస్
Published Thu, Apr 3 2014 12:22 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement