నగరంలో విషాద సంఘటన చోటు చేసుకుంది.
హైదరాబాద్: నగరంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. నెలలు నిండిన గర్భిణి బస్సు దిగి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో వేగంగా వస్తున్న ఆటో ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఫలక్‌నుమ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీనగర్‌కు చెందిన పద్మజ(35) బస్సు దిగి నడుచుకుంటూ వెళ్తుండగా.. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన ఆటో ఢీకోట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఇది గుర్తించిన పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.