హైదరాబాద్ : అంతర్ రాష్ట్ర ప్రాజెక్ట్ల నిర్మాణం, వివాదాల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం టెక్నికల్ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ ఛైర్మన్గా రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ ఎన్.గోపాల్ రెడ్డి, సభ్యులుగా మహమూద్ అబ్దుల్ రవూఫ్, కె.వేణుగోపాలరావులను నియమించింది. రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి టెక్నికల్ అడ్వైజరీ కమిటీ సలహాలు, సూచనలు చేయనుంది.