జిల్లా వాసుల త్యాగఫలమే శ్రీశైలం ప్రాజెక్టు
నందికొట్కూరు: కర్నూలు జిల్లా వాసుల త్యాగఫలంతో శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. గురువారం మల్యాల వద్ద నిర్మించిన హంద్రీనీవా సుజల స్రవంతి పథకాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. హంద్రీనీవా ద్వారా కేసీకి సాగు నీరందించేందుకు సమగ్ర సమాచారం ఇవ్వాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేసీకి మరో మూడు నుంచి ఆరు మోటర్లను పెంచి కర్నూలు, వైఎస్‌ఆర్ కడప, చిత్తూరు జిల్లాలో ఆరు లక్షల ఎకరాలకు జనవరిలోపు సాగునీరందిస్తామని చెప్పారు. ముచ్చుమర్రి ఎత్తిపోతలను ఏడాదిలోపు పూర్తి చేసి సాగునీటిని విడుదల చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. ఈ ప్రాంతం టూరిజానికి అనువుగా ఉందని, త్వరలోనే సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి మాట్లాడుతూ ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకానికి ఎంపీ నిధుల నుంచి రూ. 60లక్షల నిధులను మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.
కేసీకి సాగు, తాగునీరు విడుదల చేయాలి:
హంద్రీనీవా ద్వారా కేసీకి సాగు, తాగునీరు సరఫరా చేయాలని ఎమ్మెల్యే ఐజ య్య కోరారు. సాగునీరు విడుదల చేస్తే పంటలు సంవృద్ధిగా పండుతాయని మంత్రికి విన్నవించారు. పెండింగ్‌లో ఉన్న ముచ్చుమర్రి ప్రాజెక్టును పూర్తి చేయాలని, గుండ్రేగుల వద్ద రిజ్వాయర్ నిర్మాణం చేపట్టాలని పేర్కొన్నారు. జీవో 98 ప్రకారం ముంపు బాధితులకు తక్షణమే ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. అనంతరం రైతులు, నీటి ముంపు బాధితులు, ఐకేపీ వీవోఏలు సమస్యలతో కూడిన వినతిపత్రాలను సమర్పించారు. అంతకమునుపు గ్రామ సర్పంచ్ నాగరాణి, ఎంపీటీసీ సభ్యుడు నాగరాజు, టీడీపీ నాయకులు, ఇరిగేషన్ అధికారులు పూలమాలలు వేసి స్వాగతం పలికారు. హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ సీఈ మనోహర్, ఎస్‌సీ సుధాకర్‌బాబు, ఈఈ పాం డురంగయ్య, డీఈ నాయక్, జిల్లా సీఈ విశే ్వశ్వరరావు, ఎంపీపీ వీరం ప్రసాదరెడ్డి, కట్టమంచి జనార్దన్‌రెడ్డి, సీఐ నరసింహమూర్తి పాల్గొన్నారు.