project construction
-
ప్రాజెక్ట్‌ల నిర్మాణం, వివాదాల పరిష్కారానికి కమిటీ
హైదరాబాద్ : అంతర్ రాష్ట్ర ప్రాజెక్ట్‌ల నిర్మాణం, వివాదాల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం టెక్నికల్ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ ఛైర్మన్‌గా రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ ఎన్.గోపాల్ రెడ్డి, సభ్యులుగా మహమూద్ అబ్దుల్ రవూఫ్, కె.వేణుగోపాలరావులను నియమించింది. రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి టెక్నికల్ అడ్వైజరీ కమిటీ సలహాలు, సూచనలు చేయనుంది. -
దిగువ ఎడారే!
రాజంపేట: ప్రాజెక్టు నిర్మాణం జరిగితే నీటి కొరత తీరుతుంది. పచ్చనిపొలాలు రైతన్న ఇంట సిరులు కురిపిస్తాయి... ఇదంతా నాణేనికి ఒకవైపే. ప్రాజెక్టు నిర్మాణంతో పంట పొలాలు నిలువునా ఎండిపోతున్నాయని.. మట్లిరాజుల కాలం నాటి ఊటకాల్వలు ఒట్టిపోయాయని రైతన్నల ఆవేదన మరో కోణం. ఇది చెయ్యేరు నదిపై నిర్మించిన అన్నమయ్య ప్రాజెక్టు దిగువ ప్రాంతంలోని నందలూరు, పెనగలూరు మండలాలకు చెంది వేలాది మంది రైతుల పరిస్ధితి. అన్నమయ్య జలాశయం నిర్మితం సమయంలో ఎగువ, దిగువ ప్రాంతాలకు సమానంగా నీటి పంపిణీలో న్యాయం జరిగాలి. అయితే కేవలం ఎగువ ప్రాంత అవసరాలకే అన్నట్లు ఉంది. దిగువ ప్రాంతాల్లో నందలూరు, పెనగలూరు మండలాలున్నాయి. యేటిలో నీటి ప్రవాహంతో ఒకప్పుడు ఈ ప్రాంతంలో చక్కగా పంటలు పండేవి. ఇప్పుడు డ్యాం పుణ్యమా అని నిర్వీర్యమయ్యాయి. డ్యాం ఫుల్ అయితేనే.. జలాశయం నిండి విడుదల అరుుతే తప్ప దిగువ ప్రాంతానికి నీటి చుక్క రాదు. ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం అయితే వేసవిలో దిగువకు నీరు విడుదల చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా దిగువ ప్రాంతానికి నందలూరు కెనాల్‌ను నిర్మిస్తేనే ప్రయోజనమని రైతులు కోరుతున్నారు. అన్నమయ్య ప్రాజెక్టు తమ కడుపు కొడుతోంద ని దిగువ రెతులు ఆవేదన చెందుతున్నారు. డ్యాం నిర్మాణం ఇలా.. మొదట తొగురుపేట వద్ద డ్యాంకు శంకుస్ధాపన శిలాఫలకం వేశారు. పలు రకాల కారణాలు చూపి ఆ తర్వాత బాదనగడ్డ వద్ద చెయ్యేరు ప్రాజెక్టు నిర్మాణానికి 1976లో అప్పటి సీఎం జలగంవెంగళరావు శంకుస్ధాపన చేశారు. నిర్మాణం ఆరంభమైన 27సంవత్సరాలకు పూర్తి అరుుంది. 2003లో అప్పటి భారీ నీటీపారుదలశాఖ మంత్రి మండవ వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ప్రాజెక్టు వల్ల రాజంపేట, పుల్లంపేట మండలాలు సస్యశ్యామలమయ్యాయి. భూగర్భజలాలు బాగా పెరిగి కరువును పారదోలింది. డ్యాం నిండి నీటి విడుదల అవకాశాలు లేకపోవడంతో దిగువ ప్రాంతం పరిస్థితి మాత్రం దయనీయంగా తయూరైంది. ఎడారిగా దిగువప్రాంతం.. దిగువ ప్రాంతాలైన నందలూరు, పెనగలూరు మండలాల్లోని రైతుల కష్టాలు చెప్పనలివికాదు. చెయ్యేరు నది ఎండిపోయి ఎడారిలా ఉంది. భూగర్భజలాల అడుగంటిపోయాయి. చరిత్ర కాలంలో ఈ రెండు మండలాల్లో రైతుల కోసం మట్టిరాజుల నిర్మించిన 23 ఊటకాల్వలు ఒట్టిపోయి వాటి ఉనికే ప్రశ్నార్ధకంగా మారింది. 18వేల ఎకరాల భూములు సాగుకు నోచుకోవడంలేదు. నందలూరు మండలంలోని పాటూరు, నాగిరెడ్డిపల్లె, నందలూరు, లేబాక తదితర ప్రాంతాల్లో చుక్కనీరు లేదు. చెయ్యేటిలో చేతితో ఇసుక తీసినా నీరొచ్చేది చెయ్యేటిలో చేతితో ఇసుక తీసినా నీరొచ్చేది. ఇప్పుడు ఆ పరిస్ధితి లేదు. అన్నమయ్య డ్యామే కారణం. పెనగలూరు, నందలూరు మండలాలకు డ్యాం నిర్మాణం శాపంగా మారింది. కనీసం దిగువ ప్రాంతాల గురించి నిర్మాణ రోజుల్లో ప్రభుత్వం ఆలోచించలేదు. తోటంశెట్టి సురేష్, నారాయణనెల్లూరు, పెనగలూరు చెయ్యేరులో ఎప్పుడూ జలకళ ఉండేది చెయ్యేరులో ఒకప్పుడు జలకళతో ఉట్టిపడేది. ఇప్పుడు యేటిలో నీటి ప్రవాహం లేదు. ఇందుకు ఒక రకంగా అన్నమయ్య డ్యాం అనే చెప్పవచ్చు. డ్యాం నిర్మాణంలో దిగువ ప్రాంతాల గురించి ఆలోంచించి ఉంటే ఇప్పుడు యేరు కరువు పరిస్ధితులను అధిగమించేది.. భూమన శివశంకరరెడ్డి, మాజీ సర్పంచ్, నందలూరు చెయ్యేరు దిగువ ప్రాంతాన్ని కాపాడుకోవాలి చెయ్యేరు దిగువ ప్రాంతాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. డ్యాం నిర్మాణ సమయంలో దిగువ ప్రాంతానికి కెనాల్స్ ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇప్పటికే డ్యాం నిర్మాణం వల్ల నందలూరు, పెనగలూరు మండలాలకు కరువు ఛాయలు అలుముకుంటన్నాయి. ఇప్పుడన్నా ప్రజాప్రతినిధులు రైతుల కష్టం గురించి ఆలోచించాలి. సీవీరవీంద్రరాజు, అధ్యక్షుడు, ధర్మప్రచారపరిషత్, నందలూరు -
జిల్లా వాసుల త్యాగఫలమే శ్రీశైలం ప్రాజెక్టు
నందికొట్కూరు: కర్నూలు జిల్లా వాసుల త్యాగఫలంతో శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. గురువారం మల్యాల వద్ద నిర్మించిన హంద్రీనీవా సుజల స్రవంతి పథకాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. హంద్రీనీవా ద్వారా కేసీకి సాగు నీరందించేందుకు సమగ్ర సమాచారం ఇవ్వాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేసీకి మరో మూడు నుంచి ఆరు మోటర్లను పెంచి కర్నూలు, వైఎస్ఆర్ కడప, చిత్తూరు జిల్లాలో ఆరు లక్షల ఎకరాలకు జనవరిలోపు సాగునీరందిస్తామని చెప్పారు. ముచ్చుమర్రి ఎత్తిపోతలను ఏడాదిలోపు పూర్తి చేసి సాగునీటిని విడుదల చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. ఈ ప్రాంతం టూరిజానికి అనువుగా ఉందని, త్వరలోనే సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి మాట్లాడుతూ ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకానికి ఎంపీ నిధుల నుంచి రూ. 60లక్షల నిధులను మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. కేసీకి సాగు, తాగునీరు విడుదల చేయాలి: హంద్రీనీవా ద్వారా కేసీకి సాగు, తాగునీరు సరఫరా చేయాలని ఎమ్మెల్యే ఐజ య్య కోరారు. సాగునీరు విడుదల చేస్తే పంటలు సంవృద్ధిగా పండుతాయని మంత్రికి విన్నవించారు. పెండింగ్‌లో ఉన్న ముచ్చుమర్రి ప్రాజెక్టును పూర్తి చేయాలని, గుండ్రేగుల వద్ద రిజ్వాయర్ నిర్మాణం చేపట్టాలని పేర్కొన్నారు. జీవో 98 ప్రకారం ముంపు బాధితులకు తక్షణమే ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. అనంతరం రైతులు, నీటి ముంపు బాధితులు, ఐకేపీ వీవోఏలు సమస్యలతో కూడిన వినతిపత్రాలను సమర్పించారు. అంతకమునుపు గ్రామ సర్పంచ్ నాగరాణి, ఎంపీటీసీ సభ్యుడు నాగరాజు, టీడీపీ నాయకులు, ఇరిగేషన్ అధికారులు పూలమాలలు వేసి స్వాగతం పలికారు. హెచ్ఎన్ఎస్ఎస్ సీఈ మనోహర్, ఎస్సీ సుధాకర్‌బాబు, ఈఈ పాం డురంగయ్య, డీఈ నాయక్, జిల్లా సీఈ విశే ్వశ్వరరావు, ఎంపీపీ వీరం ప్రసాదరెడ్డి, కట్టమంచి జనార్దన్‌రెడ్డి, సీఐ నరసింహమూర్తి పాల్గొన్నారు. -
భూసేకరణే అసలు సమస్య
కొంగువారిగూడెం (జంగారెడ్డిగూడెం రూరల్), న్యూస్‌లైన్ : జిల్లాలో మెట్ట ప్రాంత రైతులకు పూర్తిస్థాయిలో సాగునీరందించాలనే లక్ష్యంతో 35 ఏళ్ల క్రితం కొంగువారిగూడెంలో నిర్మించిన శ్రీ కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయం పనులు ఇప్పటికీ పూర్తికాలేదు. కుడి, ఎడమ కాలువలు, ఎత్తిపోతల పథకాల పనులు నత్తనడకన సాగడంతో ప్రాజెక్ట్ నిర్మాణ లక్ష్యం నెరవేరడం లేదు. ఇందుకు భూసేకరణ, నిధుల లేమి కారణం. ప్రజాప్రతినిధులు, అధికారులు దీనిపై దృష్టి పెట్టకపోవడంతో మెట్ట రైతులు సాగునీటి కోసం ఆకాశం వైపు చూస్తున్నారు. ఏళ్ల తరబడి పనులు పెండింగ్‌లో ఉండటం..అధికారుల అలసత్వంతో 46 వేల ఎకరాలకు సాగు నీరందించాలనే లక్ష్యం నెరవేరడం లేదు. నిధుల లేమి ఓ కారణం వరద, సాగునీటి లక్ష్యాలుగా 1976లో కొంగువారిగూడెంలో మధ్యతరహా ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 1979, 80లో ఎర్త్ డ్యామ్ పనులు ప్రారంభించారు. అప్పట్లో ప్రా జెక్ట్‌లో నీరు నిల్వ చేసేందుకు కొంగువారిగూడెం, తాడువాయి, వేగవరం, జొన్నవారిగూడెం తదితర గ్రామాలకు చెందిన రైతుల నుంచి సుమారు 5 వేల ఎకరాలను సేకరించారు. 4 టీఎంసీల నీరు నిల్వ చేసేలా ప్రాజెక్ట్‌ను నిర్మిం చారు. ప్రస్తుతం 83.5 మీటర్ల ఎత్తున నీరు నిల్వ చేస్తున్నారు. ప్రాజెక్టు వ్యయం రూ.124 కోట్లుగా అంచనా వేశారు. ఇప్పటి వరకు రూ. 108.5 కోట్లు ఖర్చు చేసినట్టు నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే జలాశయం కుడి, ఎడమ కాలువలు, ఎత్తిపోతల పథకాలు, పిల్ల కాలువల పనులు ఇప్పటికీ సాగుతూనే ఉన్నాయి. దీనికి భూసేకరణలో జాప్యం.. నిధుల లేమి కారణం. కుడి కాలువ ద్వారా 10 వేల ఎకరాలకు.. కుడి ప్రధాన కాలువ ద్వారా 19,700 ఎకరాలకు గాను 10 వేల ఎకరాలకు మాత్రమే సాగు నీరందిస్తున్నారు. కాలువ పొడవు 45.6 కిలోమీటర్లు. పుట్లగట్లగూడెం, లక్కవరం, రావికంపాడు, నులకానివారిగూడెం, వెంకటాపురం, ఐఎస్ రాఘవాపురం, ఐఎస్ జగన్నాథపురం, రాజవరం, పోతవరం, చీపురుగూడెం, అనంతపల్లి, నల్లజర్ల, దూబచర్ల గ్రామాల మీదుగా కాలువ వెళుతోంది. 90 ఎకరాల భూమి సేకరించాలి ఎడమ ప్రధాన కాలువ ద్వారా 8 వేల ఎకరాలకు గాను 5 వేల ఎకరాలకు సాగు నీరందిస్తున్నారు. కాలువ పొడవు 7.59 కిలోమీటర్లు. చక్రదేవరపల్లి, కొంగువారిగూడెం, గుర్వాయిగూడెం, నాగులగూడెం, పేరంపేట, పంగిడిగూడెం, వెంకట రామానుజపురం తిరుమలా పురం, కేతవరం తదితర గ్రామాలకు ఈ కాలువ ద్వారా సాగునీరు అందించాలని నిర్దేశించారు. అయితే ప్రధాన కాలువలకు అను సంధానిస్తూ సబ్ఛానల్స్, తదితర పనులు పూర్తి కాలేదు. దీంతో లక్ష్యం నెరవేరడం లేదు. కుడి, ఎడమ కాలువల కోసం ఇప్పటివరకు 587 ఎకరాల భూమి సేకరించారు. పనులు పూర్తికావాలంటే మరో 90 ఎకరాలు సేకరించాల్సి ఉంది. నిరుపయోగంగా ఎత్తిపోతల పథకాలు ఎర్రకాలువ జలాశయం పరిధిలో మూడు ఎత్తిపోతల పథకాలను నిర్మించారు. దీనిలో యడవల్లి ఎత్తిపోతల పథకం నుంచి మాత్రమే 6 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. అయితే బొర్రంపాలెం, రావికంపాడు పథకాల నుంచి నీటిని అందించలేకపోతున్నారు. ఇక్క డా భూసేకరణే సమస్య. కాలువల తవ్వకానికి భూమిని సేకరించాల్సి ఉందని అధికారులు అంటున్నారు. దీనిపై అధికారులు దృష్టి సారించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. -
హడావుడి వెనుక ఆంతర్యమేమిటో?
హుజూర్నగర్,న్యూస్‌లైన్: పులిచింతల ప్రాజెక్ట్ నిర్మాణం ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ అనేక దఫాలుగా పనులు కొనసాగించిన ప్రభుత్వం పనులు పూర్తిస్థాయిలో ముగియకముందే ప్రారంభానికి సిద్ధంకావడం వెనక ఆంతర్యమేమిటో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ముంపు గ్రామాల బాధితులకు నేటికీ పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందజేయలేదు. బాధితులకు ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాల నిర్మాణాలు కూడా పూర్తికాలేదు. ప్రస్తుతం మౌలిక వసతుల కల్పన, అంతర్గత రహదారుల నిర్మాణంతోపాటు బాధితుల గృహ నిర్మాణాల పనులు జరుగుతున్నాయి. ప్రాజెక్ట్‌ను ఈ నెల 27 లేదా 30న ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డితో ప్రారంభించేందుకు హడావుడిగా తేదీ ప్రకటించి సన్నాహాలు చేస్తుండడంతో ప్రాజెక్ట్ బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మేళ్లచెరువు మండలం వజినేపల్లి వద్ద కృష్ణానదిపై రూ.1260 కోట్లతో కృష్ణాడెల్టా పరిధిలోని 13లక్షల 8వేల ఎకరాలకు సాగు నీరందించేందుకు పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. ఈ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు. ప్రాజెక్టు పనులు 90శాతం పూర్తికాగా, ముంపుబాధితుల సమస్యలు ఎక్కడివి అక్కడే ఉన్నాయి. పునరావాస కేంద్రాల్లో కొనసా..గుతున్న పనులు మేళ్లచెరువు మండలంలోని నెమలిపురి, చింతిర్యాల, కిష్టాపురం, అడ్లూరు, వెల్లటూరు, పీక్లానాయక్‌తండా, తంబారం, రేపల్లె, శోభనాద్రిగూడెం, నేరేడుచర్ల మండలంలోని రావిపాడ్, గుండెబోయినగూడెం, మఠంపల్లి మండలంలోని గుండ్లపాడ్, సుల్తాన్పూర్తండాలు ఉన్నాయి. ఈ గ్రామాల ప్రజలకుదోరకుంట, గుడిబండ, మేళ్లచెరువు, కిష్టాపురం అడ్డరోడ్డు, నక్కగూడెం, చింతిర్యాల, తంబారం, శోభనాద్రిగూడెం, పీక్లానాయక్‌తండా, పెదవీడు సమీపంలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా పునరావాస కేంద్రాలలో పనులు నేటి వరకు కొనసాగుతూనే ఉన్నాయి. ఎక్కడా పూర్తిస్థాయిలో పూర్తయిన దాఖలాలు కనిపించడం లేదు. మేళ్లచెరువు మండలం కిష్టాపురం అడ్డరోడ్డు పునరావాస కేంద్రంలో మాత్రమే కొన్ని కుటుంబాల వారు నివాసం ఉంటున్నారు. మిగిలిన కేంద్రాలలో ఎక్కడా కూడా బాధితులు గృహ ప్రవేశాలు చేయలేదు. ప్రస్తుతం ఆయా గ్రామాలలోనే నివాసం ఉంటూ సమీప సాగుభూములలో పంటలు పండించుకుంటూ జీవిస్తున్నారు. అంతేగాక నెమలిపురి, చింతిర్యాల, నక్కగూడెం రెండో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ఇటీవల సంబంధిత అధికారులు సర్వేలు నిర్వహించారు. భూ సేకరణ చేసి నక్కగూడెం, చింతిర్యాల పునరావాస కేంద్రాల నిర్మాణానికి శంకుస్థాపన మాత్రమే చేశారు. అయితే నెమలిపురి పునరావాస కేంద్రం ఏర్పాటుకు సేకరించిన భూమి విషయంలో సమస్యలు ఉండటంతో నేటి వరకు పునరావాస కేంద్రం పనులు ప్రారంభం కాలేదు.