
'టీడీపీ సర్కారుకు నూకలు చెల్లాయి'
హైదరాబాద్: టీడీపీ ప్రభుత్వానికి న్యాయవ్యవస్థ సహా దేనిపైనా నమ్మకం లేదని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. సోమవారం లోటస్ పాండ్ లో వైఎస్సార్ సీపీ శాసనసభాపక్షం సమావేశానికి ముందు ఆయన 'సాక్షి' టీవీతో మాట్లాడారు.
ప్రతిపక్ష ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసుకుని చంద్రబాబు సర్కారు నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. విపక్ష ఎమ్మెల్యేలపై కుట్ర చేస్తోందని విమర్శించారు. కోర్టు ఆదేశించినా తమ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజాను అసెంబ్లీలోకి అనుమతించకపోవడం దారుణమని వాపోయారు. టీడీపీ సర్కారుకు నూకలు చెల్లాయని శివప్రసాద్ రెడ్డి అన్నారు.