యునెస్కో జాబితాలో ఓరుగల్లు అద్భుతాలు!
- ప్రపంచ వారసత్వ సంపదగా వేయిస్తంభాల
- గుడి, వరంగల్ కోట, రామప్ప దేవాలయం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో మన రాష్ట్రానికి అరుదైన అవకాశం కలిగింది. అద్భుత శిల్పకళా సం పద, అబ్బురపరిచే అతి పురాతన నిర్మాణ పరిజ్ఞానానికి సజీవ సాక్ష్యంగా ఉన్న వరంగల్ ఈసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ప్రపంచ వారసత్వ సంపద హోదాను కేటాయించే ‘యునెటైడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో)’ తాత్కాలిక జాబితాలో వరంగల్ కోట, వేయి స్తంభాల గుడి, రామప్ప దేవాలయాలు చోటు దక్కించుకున్నా యి. ఈ సంవత్సరం చివరలో పారిస్ నుంచి యునెస్కో ప్రతి నిధులు వచ్చి వాటిని పరిశీలిస్తారు.
అనంతరం వాటికి ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు కల్పించాలా లేదా అనేదానిపై తుది నిర్ణయం తీసుకుంటారు. వీటిలో ఏ ఒక్కటైనా యునెస్కో గుర్తింపు పొందితే తెలుగు రాష్ట్రాల నుంచి ఆ ఘనత సాధించిన తొలి కట్టడంగా చరిత్రలో నిలిచిపోతుంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 32 ప్రాంతాలు యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద హోదా దక్కించుకున్నాయి. దక్షిణ భారతదేశానికి సంబంధించి తమిళనాడు, కర్ణాటక, కేరళలు ఆ ఘనత పొం దగా.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు మాత్రం అవకాశం దక్కలేదు.
తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోకి ప్రవేశించే సింహద్వారాన్ని కాకతీయ కళాతోరణం వలె నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం టెండర్లు పిలవడమా..?నామినేషన్ పద్ధతిలో అప్పగించడమా అనే అంశంపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. తెలంగాణ సచివాలయంలోకి ప్రవేశ ద్వారం లేకుండా రహదారిపై ఉంది. బారికేడ్ల సాయంతోనే సందర్శకులను లోపలికి అనుమతిస్తున్నారు. గుంపులుగా వస్తే వారిని నిలువరించడం కష్టంగా ఉంది. శుక్రవారంలోగా ప్రవేశమార్గం వద్ద గేట్లు ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే కాకతీయ కళాతోరణాన్ని ఇక్కడ నిర్మించడం ద్వారా ప్రత్యేకత చూపించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్టు అధికారవర్గాలు వివరించాయి.