సాక్షి, హైదరాబాద్: సరోజినీదేవి కంటి ఆసుపత్రికి జలమండలి అధికారులు శనివారం నీటి సరఫరాను పునరుద్ధరించారు. ఆసిఫ్‌నగర్ ఫిల్టర్ బెడ్ వద్ద వాల్వ్‌ను మార్చడంతో ఆసుపత్రికి సరఫరా అయ్యే నీటి నాణ్యత, రంగు మెరుగుపడ్డాయన్నారు. నీటి నాణ్యత పట్ల ఆసుపత్రి సూపరింటెండెంట్ సంతృప్తిని వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కంటి ఆసుపత్రిని శని వారం ఆసిఫ్‌నగర్ ఫిల్టర్ బెడ్ డెరైక్టర్ ఆపరేషన్ రామేశ్వర్‌రావు, గోషామహల్ సర్కిల్ -3 చీఫ్ జనరల్ మేనేజర్ ప్రభాకర్, జలమండలి జనరల్ మేనేజర్ స్వామి, క్వాలిటీ అక్యూరెన్స్ టెస్టింగ్ జీఎం తన్నీరుజవహార్ ఆసుపత్రిని సందర్శించా రు.
ఈ సందర్భంగా ఆసుపత్రి ప్రాంగణంలోని నీటిసంపులను, ఓవర్ హెడ్ ట్యాంకులను పరిశీ లించగా నాచు పేరుకొని పోయి అపరిశుభ్రంగా కనిపించాయి. ఈ కారణంగానే ఆసుపత్రిలో మురుగు నీటి సమస్య తలెత్తిందని తేల్చారు.
‘సరోజినీదేవి’కి నీటి సరఫరా పునరుద్ధరణ
Published Sun, Dec 13 2015 5:44 AM | Last Updated on Sun, Sep 3 2017 1:57 PM
Advertisement