గుంజుకుంటామంటే సహించం: రేవంత్
సాక్షి, హైదరాబాద్ : రైతుల నుంచి భూములు గుంజుకుంటామంటే సహించమని, వారి పక్షాన పోరాడుతామని రాష్ట్ర టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి అన్నారు. మల్లన్న సాగర్ నిర్వాసితులతో ప్రభుత్వం మాట్లాడి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రైతులపై లాఠీచార్జి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని, గాయపడిన వారికి ప్రభుత్వమే చికిత్స చేయించాలన్నారు.
ప్రభుత్వ తీరుకు నిరసనగా వచ్చే నెల 13, 14 తేదీల్లో ఇందిరాపార్కు వద్ద దీక్ష చేస్తామన్నారు. సీఎం కేసీఆర్ పోలీసులతో రాజ్యం చేస్తున్నారని, అరెస్టులకు భయపడమని చెప్పారు.