వర్సిటీల్లో ఖాళీలు భర్తీ చేయలేని ప్రభుత్వం
విద్యార్థి పోరు సభలో టీడీపీ నేత రేవంత్‌రెడ్డి
వరంగల్: తెలంగాణ ఉద్యమానికి ఊపిరి అందించిన కాకతీయ, ఉస్మానియా వర్సిటీల్లో ఖాళీలు భర్తీ చేయలేని అసమర్థ ప్రభుత్వం అధికారంలో ఉందని రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్(టీఎన్‌ఎస్‌ఎఫ్) ఆధ్వర్యంలో జనవరి 26 వరకు చేపట్టిన విద్యార్థి పోరు కార్యక్రమం హన్మకొండలో శుక్రవారం ప్రారంభమైంది.
టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జాటోత్ సంతోష్‌నాయక్ అధ్యక్షతన జరిగిన సభలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ పాలనతో విద్యారంగం భ్రష్టు పట్టిందన్నారు. ప్రపంచ చరిత్రలో ఉద్యమకారులుగా ప్రసిద్ధి చెందిన వారెవ్వరూ ఆస్తులు కూడబెట్టలేదని కేసీఆర్, కేటీఆర్‌లను ఉద్దేశించి ఎద్దేవా చేశారు.