బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ రుణాల మంజూరు చేసేందుకు బడ్జెట్‌లో అదనంగా రూ.1200 కోట్లు కేటాయించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ కు బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య విజ్ఞప్తిచేశారు. ఈ ఏడాది బీసీ కార్పొరేషన్ రుణాలకోసం 1.31.376 దరఖాస్తులు వచ్చాయని, అయితే ప్రభుత్వం కేటాయించిన రూ.125 కోట్ల బడ్జెట్‌తో కేవలం 14 వేలమందికే రుణాలు మంజూరు చేసేందుకు అంగీకరించారన్నారు.
ఈ రుణాల మంజూరు కోసం లబ్దిదారుల మధ్య తీవ్రమైన పోటీ ఉందన్నారు. గురువారం సీఎంకు ఆయన ఒక లేఖ రాస్తూ మిగిలిపోయిన 1.17 లక్షల మందికి అదనంగా రుణాలు మంజూరు చేయడానికి రూ.1200 కోట్ల బడ్జెట్ అవసరమవుతుందన్నారు. బీసీ కార్పొరేషన్‌కు 2016-17 బడ్జెట్‌లో రూ.5 వేల కోట్లు కేటాయించాలని కోరారు. 2014-15లో, అంతకుముందు బ్యాచ్‌లో దరఖాస్తు చేసుకున్నవారికి, మొత్తం రుణాల మంజూరుకు రూ.400 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తిచేశారు.
రుణాలకు రూ.1200 కోట్లు కేటాయించాలి- కృష్ణయ్య
Published Thu, Jan 28 2016 8:27 PM | Last Updated on Sun, Sep 3 2017 4:29 PM
Advertisement
Advertisement