
ప్యాట్నీ వద్ద తగలబడిన ఆర్టీసీ బస్సు
సికింద్రాబాద్ : సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ వద్ద గురువారం ఉదయం జీడిమెట్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దాంతో ప్రయాణీకులు భయంతో బస్సులో నుంచి బయటకు దూకి పరుగులు తీశారు. బస్సు సిబ్బంది వెంటనే ప్యారడైజ్లోని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ సంఘటనతో ప్యాట్నీ-ప్యారడైజ్ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కాగా అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.