డయాబెటీస్‌కు కేపిటల్గా హైదరాబాద్ | Sakshi editorial Director k.ramachandramurthy speech in live well expo | Sakshi
Sakshi News home page

డయాబెటీస్‌కు కేపిటల్గా హైదరాబాద్

Published Sat, Aug 8 2015 12:14 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

డయాబెటీస్‌కు కేపిటల్గా హైదరాబాద్ - Sakshi

డయాబెటీస్‌కు కేపిటల్గా హైదరాబాద్

హైదరాబాద్ : ఇతర నగరాలతో పోల్చితే  హైదరాబాద్ ప్రజలు ఎక్కువగా ఒత్తిడి, కాలుష్యానికి గురవుతున్నారని సాక్షి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి అన్నారు.  డయాబెటిక్కు హైదరాబాద్ కేపిటల్గా మారబోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. హైపర్‌టెన్షన్‌, డయాబెటీస్‌, హార్ట్‌ ప్రాబ్లమ్స్‌ ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి.  ఈ క్రమంలో హెల్త్‌ ఈజ్‌ వెల్త్‌ అని గట్టిగా నమ్ముతున్న 'సాక్షి మీడియా గ్రూప్‌'  లివ్ వెల్ ఎక్స్పో కార్యక్రమాన్ని  ఏర్పాటు చేస్తోంది.  ఈ సందర్భంగా శనివారం కె.రామచంద్రమూర్తి మాట్లాడుతూ ఆరోగ్యం విషయంలో వైద్యుల సూచనలు పాటించాలన్నారు. సామాజిక బాధ్యతలో భాగంగా సాక్షి మీడియా లివ్ వెల్ ఎక్స్పోను ప్రారంభించిందన్నారు.

మిగతా నగరాలతో పోల్చుకుంటే హైదరాబాద్లో కాలుష్యం ఎక్కువగా ఉందని, ప్రజలకు ఆరోగ్యం, విద్య అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని కె.రామచంద్రమూర్తి అన్నారు. అత్యుత్తమ ప్రమాణలు ఉండటంతో హైదరాబాద్కు ఇతర దేశాల నుంచి వచ్చి చికిత్స చేయించుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement