'మోస్ట్ పాపులర్ హీరో'గా మహేష్ బాబు
హైదరాబాద్: సాక్షి ఎక్సలెన్స్ అవార్డులలో మోస్ట్ పాపులర్ హీరోగా మహేష్ బాబు, లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డుకు సినీ దర్శకుడు విశ్వనాథ్ ఎంపికయ్యారు. ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటూ, ప్రముఖులతో కూడిన జ్యూరీ ద్వారా 2015 సంవత్సరానికి గాను అవార్డు గ్రహీతలను ఎంపిక చేశారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని జె.ఆర్.సి. కన్వెన్షన్ సెంటర్‌లో సాక్షి ఎక్సలెన్స్ అవార్డుల ప్రదాన కార్యక్రమాన్ని సాక్షి చైర్‌పర్సన్ వైఎస్ భారతి ప్రారంభించారు. సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి, ప్రముఖ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్ సహా పలువురు అతిథులు ఈ వేడుకకు హాజరయ్యారు.
ఎడ్యుకేషన్, సోషల్ డెవలప్‌మెంట్-ఎన్జీవో, హెల్త్‌కేర్, ఎక్సలెన్స్ ఇన్ ఫార్మింగ్, బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్-లార్జ్ స్కేల్, బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్-స్మాల్/మీడియం స్కేల్, యంగ్ అచీవర్ ఆఫ్ ది ఇయర్-ఎడ్యుకేషన్, యంగ్ అచీవర్ ఆఫ్ ది ఇయర్-సోషల్ సర్వీస్ వంటి పలు విభాగాల్లో ఈ అవార్డులను సాక్షి గ్రూపు అందజేస్తోంది. వీటితోపాటు సినిమా విభాగంలో కూడా పది పాపులర్ అవార్డులు ప్రదానం చేస్తోంది.
సాక్షి ఎక్సలెన్స్ అవార్డు గ్రహీతలు:
లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు- సినీనటుడు విశ్వనాథ్
మోస్ట్ పాపులర్ హీరో- మహేష్ బాబు
మోస్ట్ పాపులర్ డైరెక్టర్- గుణశేఖర్
మోస్ట్ పాపులర్ హీరోయిన్- రకుల్ ప్రీత్ సింగ్
మోస్ట్ పాపులర్ సినిమా- శ్రీమంతుడు
మోస్ట్ పాపులర్ పాటల రచయిత- సిరివెన్నెల సీతారామశాస్త్రి
మరణానంతర అవార్డు- సిపాయి ముస్తాక్ అహ్మద్
యంగ్ అచీవర్ అవార్డు- ఎడ్యూకేషన్- నైనా జైశ్వాల్
జ్యురీ స్పెషల్ అవార్డు- కంచె
మోస్ట్ పాపులర్ మేల్ సింగర్- కారుణ్య
మోస్ట్ పాపులర్ ఫిమేల్ సింగర్- సత్యయామిని
యంగ్ అచీవర్- సోషల్ సర్వీస్- సోనీవుడ్ నుతలపాటి
యంగ్ అచీవర్-స్టోర్ట్స్- కిదాంబి శ్రీకాంత్
యంగ్ అచీవర్ మహిళా స్పోర్ట్స్- జ్యోతి సురేఖ
తెలుగు ఎన్నారై అవార్డు- బి.టి. సింగిరెడ్డి
ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్-రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్- మాంచూ ఫెర్రర్(అనంతపురం)
తెలుగు పర్సన్ ఆఫ్ ది ఇయర్- డీఆర్డీవో- సతీష్ రెడ్డి (సైంటిస్ట్)
ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అవార్డు- పద్మనాభరెడ్డి